Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీకి చిక్కులు.. ఈడీ నోటీసులు జారీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఈ కుంభకోణం పాకింది. ప్రస్తుతం ఢిల్లీలో పాటు తెలుగు రాష్ట్రాలకు ఆ స్కాంతో లింకులు ఉన్నట్లు బయటపడటంతో ఇక్కడ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందని పలువురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. ఇందులో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గతంలో సోదాలు నిర్వహించగా.. శుక్రవారం మళ్లీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాుడులు చేపట్టింది. ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురి వ్యక్తుల ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది.

హైదరాబాద్, నెల్లూరుతో పాటు చెన్నైన, బెంగళూరుల ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ స్పెషల్ బృందాలు.. దేశవ్యాప్తంగా 40 చోట్ల దాడులు చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది. అలాగే హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత దగ్గర గతంలో ఆడిటర్ గా పనిచేసిన బుచ్చిబాబు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం టీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపుతోంది. కవితకు ఈడీ నోటీసులు కూడా అందినట్లు ప్రచారం జరుగుతోంది.

కానీ తనకు ఎాలాంటి నోటీసులు అందలేదని కవిత ట్విట్టర్ ద్వారా ఖండించారు. అయితే 12 మంది వ్యక్తులతో పాటు 18 కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. గురువారం ఢిల్లీ లిక్కర్ స్కాంలో స్టింగ్ ఆపరేషన్ వీడియోను బీజేపీ నేతుల బయటపెట్టిన విషయం తెలిసిందే. అది బయటపెట్టిన మరుసటి రోజే ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం విశేషం.

అయితే వైసీపీ ఎంపీ మాగుంటకు చెందిన కంపెనీకి కూడా ఈడీ నోటీసులు ఇచ్చి తెలుస్తంది. మాగుంట రాఘవతో పాటు మాగుంట అగ్రో ఫామ్స్ కు ఈడీ నోటీసులు అందాయి. ఇక లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లై, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు గోరంట్ల, చందన్ రెడ్డి, పెర్నాయి రిచర్డ్, విజయ్ నాయర్, సమీర్ మహీంద్ర, దినేష్ అరోరా, వై.శశిఖ, మాగుంట రాఘువకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అలాగే మాగుంట అగ్రో ఫామ్స్ తో పాటు శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్, బాలాజీ డిస్టిల్లరీజ్, జైనాబా్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీమీస్ ఎంటర్ర ప్రైజెస్, ఎన్రికా ఎంటర్ ప్రైజెస్, పిక్సీ ఎంటర్ ప్రైజెస్, అరబిందో ఫార్మా, ఆర్గానామిక్్ ఈకో సిస్టమ్స్ లిమిటెడ్, ట్రైడెంట్ ప్రైవట్ లిమిటెడ్, ఇండో స్పిరిట్స్, టెక్రా పెరల్ డిస్టిల్లరీస్, రాబిన్ డిస్టిల్లరీస్, పెగాసస్ ఎంటర్ ప్రైజెస్, డిప్లొమాట్ ఎంటర్ ప్రైజెస్, డైయాడిమ్ ఎంటర్ ప్రైజెస్, వైకింగ్ ఎంటర్ ప్రైజెస్, హివిడే ఎంటర్ ప్రైజెస్ కంపెనీకలు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

అయితే వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కంపెనీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం ఏపీ లో కలకలం రేపుతోంది. తనకు లిక్కర్ స్కాంతో ఎలాంటి సంబంధం లేదని గతంలో మాగుంట క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించం, కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేయడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ దీనిపై వైసీపీని విమర్శించే అవకశముంది. ఇప్పటికే ఏపీలో మద్యం విక్రయాలపై వివాదం జరుగుతోంది. వైసీపీ నేతల లోకల్ బ్రాండ్లు తయారుచేసి ప్రజల ప్రాణాలను తీసుస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇలాంటి తరుణంలో వైసీపీ ఎంపీ లిక్కర్ స్కాంలో చిక్కుకోవడం కలకలం రేపుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -