Daggubati Abhiram: దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి ఫిక్స్.. వధువు బ్యాగ్రౌండ్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Daggubati Abhiram: దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. త్వరలోనే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మరో భారీ పెళ్ళికి సిద్ధమవుతుంది. అవునండి.. స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుపాటి సురేష్ బాబు చిన్న కుమారుడైన అభిరామ్ దగ్గుపాటి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. త్వరలోనే అతను పెళ్లి పీటలేకపోతున్నాడు. వధువు మరెవరు కాదు రామానాయుడు తమ్ముడు మనవరాలు. అంటే సురేష్ బాబుకి వరుసకి చెల్లెలి కూతురు అవుతుంది ఆమె.

వధువు కుటుంబం ఇప్పుడు కారంచేడులో ఉంది. ఈ కుటుంబానికి ఏమాత్రం చలనచిత్ర నేపథ్యం లేకపోవడం విశేషం. అభిరామ్ ఆ అమ్మాయి చిన్నప్పటినుంచి ఒకరు ఒకరు ఇష్టపడుతున్నారని, వీరి ప్రేమకి ఇరు కుటుంబాలు వారు పచ్చ జెండా ఊపారని సమాచారం. రామానాయుడు కోరిక కూడా ఇదేనని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అభిరాం పెళ్లి ఇండియాలో కాకుండా గ్రాండ్ గా శ్రీలంకలో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

డిసెంబర్ 6వ తారీఖున ఈ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. శుభలేఖలు కూడా డిఫరెంట్ గా ప్రింట్ చేస్తున్నట్లు సమాచారం. కారంచేడు లోని ఉన్న రామానాయుడు పాత ఇల్లు డిజైన్ ని శుభలేఖలు మీద అచ్చు వేయిస్తున్నారట దగ్గుబాటి వారు. ఇక అభిరాం కెరియర్ విషయానికి వస్తే అతను రానా దగ్గుపాటి, కాజల్ జంటగా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో నిర్మాతగా పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఆ తరువాత అహింస సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు.

అయితే ఇది ఆశించిన స్థాయి ఫలితాలని ఇవ్వలేదు. ప్రస్తుతం అభిరాం ఒక కాఫీ షాప్ ని ఓపెన్ చేసే పనిలో ఉన్నాడు. రామానాయుడు స్టూడియో పక్కనే రైటర్స్ కాఫీ షాప్ పేరుతో ఒక షాప్ ఓపెన్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ఇదే అభిరామ్ తనని వాడుకున్నాడని అవసరం తీరాక అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టాడని శ్రీరెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పటివరకు అభిరామ్ అంటే ఎవరో తెలియని ఇతను శ్రీ రెడ్డి ఇష్యూ తో వైరల్ అయిపోయాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -