Abhiram-NTR: నీ సంగతి చెప్తా ఎన్టీఆర్.. తారక్ కు దగ్గుబాటి అభిరామ్ వార్నింగ్ మామూలుగా లేదుగా!

Abhiram-NTR:  టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. కాగా గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఎన్టీఆర్ ఆ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నందమూరి తారక రామారావు మనవడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తారక్ నటన విషయంలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఇక సినిమాలలో ఎన్టీఆర్ డైలాగ్స్ ని ఎంత పవర్ఫుల్ గా చెప్తాడో మనందరికీ తెలిసిందే. అలాంటి ఎన్టీఆర్ కి రియల్ లైఫ్ లో దగ్గుబాటి హీరో వార్నింగ్ ఇచ్చాడు.

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్.. తేజ దర్శకత్వంలో రూపొందిన అహింస సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. సినీ నేపథ్యమున్న కుటుంబం కావడం, కొన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేయడంతో ఆయనకు సినీ పరిశ్రమలో ఎందరో హీరోలతో మంచి అనుబంధం ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిరామ్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా అభిరామ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారి డ్యాన్స్ కి, పర్ఫామెన్స్ కి హ్యాట్సాఫ్. కలిసినప్పుడు మేము బాగా మాట్లాడుకుంటాము.

చిన్నప్పుడు నేను ఆయనకు ఒకటి చెప్పా.. వస్తున్నా, నేను కూడా దిగుతా అప్పుడు చెప్తా నీ సంగతి అని. ఇప్పుడు నన్ను ఎగతాళి చేస్తాడు. అరే భయమేస్తుందిరా.. నువ్వు దిగావు ఇండస్ట్రీలోకి, నన్ను పంపిస్తావు ఇంటికి అంటాడు. అలా సరదాగా ఉంటాం అంటూ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు అభిరామ్. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిరామ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య అంత చనువుందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -