Dasoju Sravan: దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ఎంట్రీతో ఆ సీనియర్ నేతకు మరిన్ని చిక్కులు?

Dasoju Sravan: సీనియర్ నేత దాసోజు శ్రవణ్ గత రెండు నెలల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయతే బీజేపీలో ఇమడలేకపోవడం, ప్రాధాన్యత దక్కకపోవడంతో ఇప్పుడు బీజేపీని వదిలి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణల భవన్‌లోమంత్రి కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ స్వయంగా కండువా కప్పి దాసోజు శ్రవణ్‌ను పార్టీలోకి ఆహ్వనించారు. దాసోజు శ్రవణ్ తో పాటు శాసనమండి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ పై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లో దాసోజు శ్రవణ్ సెల్ప్ మేడ్ లీడర్ అంటూ ప్రశంసలు కురిపించారు.

దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ లు తిరిగి టీఆర్ఎస్ లో చేరడం ఆనందంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ఇక స్వామి గౌడ్ మాట్లాడుతూ.. విభజన సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతోనే బీజేపీలో చేరానని, కానీ బీజేపీలో ఎందుకు చేరానో అది నెరవేరలేదన్నారు. అందుకే బీజేపీకి రాజీనామా చేసి టీార్ఎస్ లో చేరినట్లు తెలిపారు. ఇక ద్రాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ లో చేరడం ఆనందంగా ఉందని, అనాలాలోచిత నిర్ణయాల వల్లే గతంలో టీఆర్ఎస్ లో వీడానని దాసోజు శ్రవణ్ తెలిపారు. బీజేపీలో కొంతమంది మూస రాజకీయాలు చేస్తున్నారని, చివరి శ్వాస వరకు కేటీఆర్ కు అండగా ఉంటానని శ్రవణ్ చెప్పుకొచ్చారు.

అయతే దాసోజు శ్రవణ్ రాకతో ఖైరతాబాద్ నియోజకవర్గ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి టీఆర్ఎస్ తరపున దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరడంతో ఖైరతాబాద్ టికెట్ ఎవరికి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ లో ఖైరతాబాద్ టికెట్ దక్కదనే కారణంతోనే బీజేపీలో చేరారు. ఖైరతాబాద్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఉన్న విజయారెడ్డి కాంగ్రెస్ ను వీడారు. దీంతో విజయారెడ్డికే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికె్ ఇస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు విజయారెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

దీంతో దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ను వదలేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీతో సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో టీఆర్ఎస్ లో చేరారు. దీంతో దాసోజు శ్రవణ్ కు టీఆర్ఎస్ ఎలాంటి హామీలు ఇచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ఎంట్రీతో దానం నాగేందర్ కు చెక్ పడుతుందనే చర్చలు మొదలయ్యాయి. దానం నాగేందర్ హవా తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్ కు ఎర్త్ పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ దాసోజు శ్రవణ్ కు టికెట్ దక్కితే దానం నాగేందర్ దారెటు అనే ప్రచారం జరుగుతోంది. 2014లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దానం నాగేందర్.. బీజేపీ చేతిలో ఓటమి చెందారు.

ఆ తర్వాత దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2018కి ముందు టీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీని నుంచి పోటీ చేసి గెలుపొందారు. వచ్చే ఎన్నికలలో కూడా తనకే టికెట్ దక్కుతుందనే ఆశలో ఆయన ఉన్నారు. ఇప్పుడు దాసోజు శ్రవణ్ రాకకతో టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో చీలిపోతుందనే ప్రచారం జరుగుతోంది. దానం నాగేందర్ పై అసంతృప్తితో ఉన్న వర్గం దాసోజు శ్రవణ్ వైపు మళ్లే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -