Rangareddy: గంటల వ్యవధిలోని తల్లి కూతురు బలవర్మరణం?

Rangareddy: ఇటీవల కాలంలో చాలా మంది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చిన్న చిన్న వాటికే ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకొని అర్ధాంతరంగా మరణిస్తున్నారు. రెప్పపాటి కాలంలో ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకొని తనువు చాలించడంతోపాటు కుటుంబాలకు, తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. దీంతో కుటుంబాలు తీరని విషాదాలు మిగులుతున్నాయి.. ఇటీవల కాలంలో అటువంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

కొన్ని కుటుంబాలలో అయితే కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి కూతురి ఆత్మహత్యలు తీవ్రతలు రేపుతున్నాయి. హైతాబాద్ గ్రామానికి చెందిన మల్లేశ్, యాదమ్మలకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కొంతకాలం క్రితం మల్లేశ్ చనిపోయాడు. అప్పటి నుంచి యాదమ్మ కూతురు, కొడుకును ఎన్నో కష్టాలు పడి సాకింది. రెండు సంవత్సరాల క్రితం కూతురు సుమిత్రకు రుద్రారం గ్రామానికి చెందిన శివకుమార్ తో పెళ్లి కూడా అయింది.

 

పెళ్లి తరువాత కూతురు, అల్లుడికి మద్య చిన్న చిన్న వివాదాలు రావడం యాదమ్మ వెళ్లి సర్ధి చెప్పడం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే సుమిత్రతో గొడవపడిన శివకుమార్ తాజాగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి బతికించారు. తన భర్త శివకుమార్ తన కారణంగానే మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని పశ్చాత్తాపంతో సుమిత్ర తాజాగా రాత్రి తల్లి ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్తతో ఆనందంగా ఉండాల్సిన తన కూతురు హఠాత్తుగా చనిపోవడంతో జీర్ణించుకోలేకపోయింది యాదమ్మ.

 

తన కూతురు జీవితం ఇలా అయ్యిందే అన్న ఆవేదనతో ఇంటిముందు ఉన్న సంపులో దూకి బలవన్మరణానికి పాల్పపడింది. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే తల్లి కూతురు చనిపోవడంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో ఎంతో కలివిడిగా ఉండే తల్లి కూతురు చనిపోవడంతో గ్రామస్థులు కన్నీరు పెట్టుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -