TDP – Janasena: టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే… హాట్ టాపిక్ గా ఇండియా టుడే సర్వే

TDP – Janasena: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయినా ఇప్పటినుంచే ఎన్నికల వేడి మొతలైంది. పార్టీలన్నీ ఎన్నికలకు ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమవుతుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనలు, వివిధ కార్యక్రమాలు చేపడుతూ రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే రాష్ట్రంలో సర్వేలు కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అధికారం వస్తుందనే దానిపై పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ సర్వేలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వేను విడుదల చేసింది. ఈ సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ సర్వేలో ఏపీలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే అధికారం అని తేలింది. వైసీపీకి 126 సీట్లు వస్తాయని తేలింది. ఇక లోక్ సభ ఎన్నికల విషయానికొస్తే.. వైసీపీకి 18 సీట్లు, టీడీపీకి 7 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది.  ఈ ఏడాది ఫిబ్రవరి-ఆగస్టు మధ్య ఈ సర్వే నిర్వహించారు.  ఇక ఏపీలో జాతీయ పారటీలైన కాంగ్రెస్, బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో బీజేపీకి 6 సీట్లు, టీఆర్ఎస్ కు 8 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది.

ఇక కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తుందని ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది.  వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 286 సీట్లు వచ్చే అవకాశముందని, కాంగ్రెస్ కు 144 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. ఇఖ ఇతర పార్టీలు 11 సీట్లు గెలుచుకుంటాయని తెలిపింది. 2019 ఎన్నికల్లో బీజేపీపకి 303 సీట్లు రాగా.. ఈ సారి సీట్లు తగ్గనున్నాయి. ఇక కాంగ్రెస్ కు సీట్లు పెరగనున్నాయి.

ఇక 53 శాతం ప్రజలు మోదీని ప్రధానిగా కోరుకుంటున్నారని, రాహుల్ గాంధీని ప్రధానిగా 9 శాతం మంది మాత్రమే ఇష్టపడుతున్నారని ఇండియా టుడే సర్వే తెలిపింది. అయితే ఈ సర్వే ఫలితాలపై జోరుగా చర్చ జరుగుతుంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగానే చేసిన సర్వే ఇది. దీంతో రెండేళ్ల తర్వాత ఏమైనా జరగొచ్చు. అప్పటికీ పరిస్థితులు ఇలాగే ఉండకపోవచ్చు. ప్రభుత్వాలపై అప్పటికీ వ్యతిరేకత పెరగవచ్చు లేదా పెరగవచ్చు.

ఏపీ విషయానికొస్తే.. ఎన్నికల నాటికి టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశముంది.  ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలు మారిపోయే అవకాశముంది. ఇండియా టుడే ఇప్పుడు నిర్వహించిన సర్వేలో పొత్తుల అంశం ప్రస్తావించలేదు. ఒకవేళ టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తే ఏమవుతుందనే దానిపై సర్వేలు చేయలేదు. దీంతో ఎన్నికల నాటికి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే సర్వే ఫలితాలు మారిపోయే అవకాశముంది.

ఇక కేంద్రంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు కలిసే అవకాశముంది. అలా జరిగితే రాజకీయ పరిణామాలు మారే అవకాశముంది. సర్వే ఫలితాలు కూడా మారే అవకాశముంటుంది. దీంతో ప్రస్తుతం పరిస్థితి, రాజకీయ అంశాలు ప్రకారమే ఇండియా టుడే సర్వే నిర్వహించింది. దీంతో రెండేళ్ల తర్వాత కూడా ఇవే ఫలితాలు వస్తాయనేది చెప్పలేం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -