Modi-Pawan Kalyan: మోదీ-పవన్ భేటీలో ఏం మాట్లాడుకున్నారంటే..?

Modi-Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశంపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇరువురు ఏం మాట్లాడుకున్నారనేది హాట్‌టాపిక్‌గా మారింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత మోదీని పవన్ స్వయంగా కలుసుకుని మాట్లాడారు. దాదాపు అరగంటకుపైగా మోదీతో, భేటీ జరిగింది. ఏపీలోని శాంతిభద్రతల పరిస్థితిపై మోదీ, పవన్ మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు.

 

వైసీపీ మూడు రాజధానుల అంశంతో పాటు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్న తీరును మోదీకి పవన్ వివరించినట్లు చర్చ జరుగుతోంది. భూకబ్జాలు, లిక్కర్, ఇసుక మాఫియాపై మోదీకి పవన్ డీటైల్డ్‌గా చెప్పినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తోన్నాయి. విశాఖ, ఇప్పటంలో తనకు పోలీసులు అడ్డుపడిన విధానాన్ని, వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు గురి చేసిన అంశాన్ని మోదీకి పవన్ వివరించినట్లు ప్రచారం జరుగుతోంది.

 

అలాగే ఏపీలోని రాజకీయ అంశాలపై మోదీతో పవన్ చర్చించినట్లు తెలుస్తోంది.  ఏపీలోని పరిస్థితులపై 5 పేజీల బ్రీఫ్ నోట్ మోదీకి పవన్ సమర్పించినట్లు సమాచారం. ఆ నోటీస్ ను మోదీ పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వివిధ వర్గాలపై పడుతున్న ప్రభావం లాంటి అంశాలపై మోదీకి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలపై అక్రమ కేసుల వ్యవహారాన్ని కూడా మోదీకి పవన్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి..

 

అలాగే కొంతమంది బీజేపీ నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్న పవన్.. వారి గురంచి కూడా మోదీకి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. మోదీతో తన సమావేశంతో భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని ఆశిస్తోన్నట్లు తెలిపారు. తమ సమావేశం రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఇస్తుందని అనుకుంటున్నట్లు చెప్పారు.  తన నుంచి అన్ని విషయాలు అడిగి మోదీ తెలుసుకున్నారని, తనకు అవగాహన ఉన్న అన్ని అంశాలను వివరించినట్లు చెబుతున్నారు. ఏపీకి మంచి రోజులు వస్తాయని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -