Dev Mohan: వైరల్ అవుతున్న దేవ్ మోహన్ సంచలన వ్యాఖ్యలు!

Dev Mohan: సమంత తాజాగా నటించిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో విఫలమైందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించిన విషయం మనకు తెలిసిందే.ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సమంతతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దేవ్ మోహన్ మాట్లాడుతూ… శాకుంతలం సినిమా తనకు మూడవ ప్రాజెక్ట్ అని తెలిపారు. ఇలా తనకు స్టార్ యాక్టర్స్ తో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అయితే తాను మొదట ప్రిఫరెన్స్ మాత్రం కథకు మాత్రమే ఇస్తానని దేవ్ మోహన్ వెల్లడించారు. స్క్రిప్ట్ వినేటప్పుడు ఆ కథకు తాను కనెక్ట్ అయితేనే సినిమాలలో నటిస్తానని ఈ సందర్భంగా ఈయన తెలియచేశారు.

 

ఇక సమంతతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి ఈయన మాట్లాడుతూ… సమంత అద్భుతమైన నటి అని ఈమె తన కోస్టార్స్ ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో సమంతతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం గురించి ఈయన మాట్లాడారు.సమంతతో ఇలాంటి సన్నివేశాలలో నటిస్తున్న సమయంలో తాను ఏమాత్రం నర్వస్ ఫీల్ కాలేదని తెలిపారు.

రొమాంటిక్ సన్నివేశాలలో నటించే సమయంలో నేను సమంతను చూడలేదని తనలో శకుంతలని మాత్రమే చూసానని అందుకే తనకు ఈ సన్నివేశాలలో నటించడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి రెయిన్ బో అనే సినిమాలో కూడా నటించే అవకాశం అందుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -