Viveka Murder Case: వివేకా హత్య కేసులో నిందితునికి బెయిల్.. ఏపీలో ఇంకెన్ని ఘోరాలు చూడాలో అంటున్న నెటిజన్లు!

Viveka Murder Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులో భాగంగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిని ఇన్ని రోజులు కస్టడీలో ఉంచిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇక ఈయనకు బెయిల్ మంజూరు చేస్తూ రెండు లక్షల పూచికత్తు సమర్పించాలని తెలిపింది.

ప్రతి వారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశిచింది. అలాగే ఏపీలో ప్రవేశించకూడదని షరతు పెట్టింది. ఇలా వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈయనకు ఒక్కసారిగా బెయిలు మంజూరు కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు మరో నెలరోజులు గడుపు ఉండగా ఈయన బయటికి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

శివ శంకర రెడ్డికి ఏపీలోకి ప్రవేశం లేదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శివశంకర్ రెడ్డి పులివెందుల రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొనేవారు. ఈయన అవినాష్ రెడ్డి రాజకీయ వ్యవహారాలన్నింటిని చక్కబట్టేవారు అయితే ఈయన లేకపోవడంతో ఈ ఎన్నికల సమయంలో పార్టీ వ్యవహారాలను చూసుకోవడం అవినాష్ వళ్ళ కాలేదు. దీంతో ఈయనకు బెయిల్ తెప్పించారని తెలుస్తోంది.

ఇక ఈయనకు ఏపీలోకి ప్రవేశం లేకపోయినా ఫోన్ల ద్వారా కూడా పులివెందులలో రాజకీయాల అన్నింటిని కూడా చక్క బెట్టవచ్చు. ఎన్నికల సమయంలో శివశంకర్ రెడ్డి జైలులో ఉండటం వల్ల పులివెందల వైసీపీ పార్టీ వ్యవహారాలు అగమ్యగోచరంగా మారిపోయాయి. అందుకే ఈయనని ఇలా బయటకు రప్పించారనీ తెలుస్తుంది. ఇక ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నాయి. ప్రధాన నిందితులకు బెయిల్ ఇచ్చి బయటకు పంపించడం ఏంటి మన రాష్ట్రంలో ఇంకా ఇలాంటి ఘోరాలను ఎన్ని చూడాలో అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -