YS Sunitha – YS Avinash: అవినాష్ రెడ్డి పాలు తాగే పిల్లోడా.. సునీత ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా?

YS Sunitha – YS Avinash: ఏపీ రాజకీయాలంటే వైఎస్ కుటుంబంలోని రాజకీయాలుగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా కడప రాజకీయాలు వైఎస్ ఫ్యామిలీ చుట్టే తిరుగుతున్నాయి. దీనికి కారణం వైఎస్ వివేకా హత్య కేసు. విపక్షాలన్నీ వైసీపీని ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి, జగన్‌ను టార్గెట్ చేస్తున్నాయి. వైఎస్ కుటుంబంలో ఆ అన్నదమ్ములపై యుద్దం ప్రకటించిన అక్కాచెల్లెళ్లు ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యనే ఆయుధంగా మార్చుకున్నారు .. సొంతబాబాయిని హత్య చేసిన వారికే జగన్ మళ్లీ సీటిచ్చారని వైఎస్ షర్మిల, సునీతలు డైరెక్ట్‌గా జగన్‌ని టార్గెట్ చేస్తున్నారు. సునీత, షర్మిల చేస్తున్న ప్రచారానికి వైసీపీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అయితే.. ఇప్పుడు జగన్ మేనమామ చేసిన కామెంట్స్ వైసీపీని మరింత ఇరుకున పెట్టేశాయి. ఆయన కామెంట్స్ పై వైఎస్ సునీత సూటి ప్రశ్నలు సందిస్తే.. వైసీపీ దగ్గర సమాధానం కూడా లేకుండా పోయింది.

మూడు రోజుల క్రితం సీఎం జగన్ మేనమామ, కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద షాకే ఇచ్చాయి. వివేకా హత్యకు సంబంధించిన ఆధారాల్ని ఎర్ర గంగిరెడ్డి తుడిచేస్తుంటే, ఎంపీ అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ నిలబడ్డారని చెప్పుకొచ్చారు రవీంద్రనాథ్‌రెడ్డి. అంతేకాని అవినాష్‌కు ఏ పాపం తెలియదని వెనకేసుకొచ్చారు. నిన్న మొన్నటి వరకూ నిజంగానే అవినాష్ రెడ్డి అమాయకుడు అనుకునే వాళ్లకు జగనన్ మేనమామ ఓ క్లారిటీ ఇచ్చారు. వైఎస్ వివేకా హత్య సమయంలో అవినాష్‌రెడ్డి అక్కడే ఉన్నారని అర్థం అయ్యేలా చెప్పారు. అవినాష్ రెడ్డిని చూపిస్తూ రవీంద్రనాథ్​రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్​ టాపిక్‌గా మారాయి. జగన్ మేనమామ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతూ.. పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

బాబాయి హత్య కేసులో ఆధారాలు తుడిచేస్తుంటే రక్త సంబంధీకుడైన అవినాష్ చూస్తూ ఎలా ఊరుకున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేకపోతే, కనీసం పోలీసులకైనా ఫిర్యాదు చేయాలి కదా? కానీ ఎందుకు చెప్పలేదు? … గుండెపోటుతో మరణించారని కలర్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేశారన్న డౌట్లు వక్తమవుతున్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కూడా రవీంద్రనాథ్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుట్టింటివాళ్లు బాగుండాలని ఆడపడుచులు కోరుకుంటారని, అయితే షర్మిల మాత్రం చెడు కోరుకుంటున్నారని మండిపడ్డారు … ఆ ఎన్నికల్లో ఆమెను ఓడించి, అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని కోరారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అమ్ముకున్నట్లు, తెలంగాణలో పార్టీని అమ్మేసిన షర్మిల ఆంధ్రకు వచ్చారని కమలాపురం ఎమ్మెల్యే సొంత మేనకోడలిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి మొత్తమ్మీద జగన్ మేనమామ చేసిన వ్యాఖ్యలు అటు కడప పాలిటిక్స్‌లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా హాట్ ‌టాపిక్‌‌గా మారాయి.. అవినాష్ హత్యస్థలంతో ఉన్నారని రవీంద్రనాథ్ క్లారిటీ ఇవ్వడం చూస్తూ .. ఆయనది అమాయకత్వమా?.. లేకపోతే దాని వెనుక ఇంకేమైనా లెక్కలున్నాయా? అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లోనే మొదలైందిప్పుడు..

రవీంద్రనాథ్ రెడ్డి కామెంట్స్ కి సునీత సూటిగా ప్రశ్నించారు. హత్య జరిగిన దగ్గర గంగిరెడ్డి రక్తపు మరకలు కడుగుతుంటే అవినాష్ రెడ్డి చూస్తుం ఉండిపోవడం ఏమైనా నమ్మసక్యంగా ఉందా అని ఆమె ప్రశ్నించారు. అంతజరుగుతున్నా.. ఏం జరిగిందో తెలియకపోవడానికి అవినాష్ రెడ్డి ఏమైనా పాలు తాగుతున్నా పిల్లోడా అని ఆమె ప్రశ్నించారు. వివేకాకు చనిపోతే.. పోలీసులకు ఫోన్ చేయకుండా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. సాక్ష్యాలు నాశనం చేయడం నేరమని ఆయనకు తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. వరుస ప్రశ్నలతో అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని షర్మిల, సునీత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -