Flowers: దొంగతనం చేసిన పూలతో పూజిస్తే వచ్చే జన్మలో ఇలా పుడుతారట.. నిజమా!

Flowers:  హిందూవులు ప్రతిరోజూ పూజలు చేయడం సాధారణమే. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా పూజ చేస్తుంటారు. కొందరు పండ్లతో దేవుడికి పూజ చేయగా మరికొందరు పూలు, ఇతరాత్ర సామగ్రితో పూజలు చేస్తుంటారు. ఎవరు ఎలా చేసినా పూలను మాత్రం పూజలో కచ్చితంగా వాడుతుంటారు. కానీ.. కొందరు పూజ చేసేటప్పుడు వారికే తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. పొరిగింట్లో ఏదో ఒక పూజ జరుగుతుందని తెలిస్తే అక్కడికి వెళ్లాలనుకున్నప్పుడు పక్కింటి ఆవరణలోనే పూలనో.. లేదా వేరే తోటలోంచి వారికి తెలియకుండా పూలను కోసుకొచ్చి పూజలో పాల్గొంటారు. మరికొందరైతే పూజలో కూర్చున్న తర్వాత పక్కవారి తాంబులంలో పూలు లేదా నూనె, వత్తులు తీసుకోవడమో చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదట. అంతేకాక ఇతరుల చెట్లకున్న పూలను కోసి పూజ చేయడం అస్సలు మంచిది కాదట.

పురాణాలలో ప్రతి దానికి గురించి వివరణ ఇచ్చారు. అంతే కాకుండా దేవతలను పూజించే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని వివరించారు. పూజకు వాడే వస్తువులు దొంగతనం గానో లేదా అడగకుండానో, ఇతరులవి ఉపయోగిస్తే ఏం జరుగుతుందో శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి వివరించినట్లు గరుడ పురాణంలో పేర్కొనబడింది. దాని ప్రకారం.. తాంబూలం, పూలు, ఫలాలు మొదలైనవి దొంగతనం చేస్తే అడవిలో కోతిగా జన్మిస్తారు. పాదుకలు, గడ్డి, పత్తి తదితరాలను తెలియకుండా తీసుకొస్తే మేకగా జన్మిస్తారట.

అయితే పూలు, ఫలాల విషయంలో ఇలాంటి తప్పిదాలు అస్సలు చేయకూదని పురాణాల్లో చెప్పబడింది. అలాగే మన ఇంటి పూలు కోసే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని పండితులు చెప్తున్నారు. చెట్టుకున్న మొత్తం పూలు కోయకుండా.. కొన్ని పూలు వదిలి పెట్టాలి. ఇలా చేస్తే మంచి జరుగుతుందని అందుకు మనం పూజలో పాల్గొనే మందు మన ఇంటి ఆవరణలోనే పూలను వాడటం మీతో పాటు, మీ కుటుంబ సభ్యులకు మంచిదట పురాణాల్లో పేర్కొంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -