Edible Flowers: ఈ పువ్వులు తింటే వ్యాధులు దరిచేరవట.. నిజమా?

Edible Flowers: సాధారణంగా ఆరోగ్యం బాగలేకపోయినా.. జ్వరాలు వచ్చిన మనం చేసేది ఒక్కటే. నేరుగా ఆస్పత్రులకు పరుగులు తీయడం. అదే ఇంట్లో ఉన్న తాతాలు బామ్మలు కొన్ని దినుసులు తినే ఆరోగ్యాన్ని కపాడుకుంటారు. కొందరు మెడిసిన్‌ను నమ్మితే.. మరికొందరు ఆయుర్వేదాన్ని నమ్ముతారు. అయితే.. మెడిసిన్, ఆయుర్వేదంతో పాటు కొన్ని పువ్వులను కూడా తినడంతో పలు వ్యాధులను దూరం చేయవచ్చంట. పువ్వులను ఎక్కువగా పూజ కోసం లేదా.. ఇల్లు, మండపాల అలంకరణ కోసం వాడుతారు. కానీ.. చాలా పువ్వులు ఔషధంగుణాలతో నిండి ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. ఈ పువ్వుల ద్వారా ఎన్నో రకాల వ్యాధులను దూరం చేయవచ్చు.

బంతిపువ్వు

సాధారణంగా చలికాలంలో కనిపిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. కడుపు సంబంధిత సమస్యలను తొలగించడంలో ఇది దోహదపడుతోంది.

మందార పువ్వు

మందార పువ్వ తినడంతో మలబద్ధకం ఉంటే అది తొలగిపోతుంది. దీంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు. ఈ పువ్వు గర్భిణులకు చాలా మేలు చేస్తుంది. ఈ పువ్వులో యాంటీ–ఆక్సిడెంట్‌ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేస్తోంది.

గులాబీ..

గులాబీలో ఎన్నో రకాల యాంటీ–ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉంటాయి. ఇది విటమిన్ల గొప్ప మూలం. దీని ఉపయోగం ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

లావెండర్‌ సువాసనగల పువ్వు..

ఈ పువ్వును తింటే కండరాలు, కీళ్ల నొప్పులు మటుమాయం అవుతాయి. ఎలాంటి రోగాలు, ఇన్ఫెక్షన్‌ రాకుండా కాపాడుతుంది. ఈ పువ్వు జుట్టుకు చాలా మేలు చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -