Puja Tips: పూజలో ఏ పువ్వులు వాడాలో తెలుసా?

Puja Tips: తెలుగు సాంప్రదాయంలో పూజ ఓ ముఖ్యమైన పవిత్రమైన పని. ఒకరోకరు తమకిష్టమైన దేవుళ్లు, దేవతలకు పూజలు చేస్తుంటారు. కొందరు దేవుళ్లకు పండ్లు సమర్పించి పూజలు చేయగా.. మరికొందరు పువ్వులతో పూజలు చేస్తారు. దాదాపుగా ఎక్కువ మంది పువ్వులనే పూజకోసం వాడుతారు. అందులోను వివిధ రకాల పువ్వులు ఉంటాయి. మరి కొంతమంది ప్రతి రోజూ పూజలు చేస్తారు కాబట్టి దేవుడికి సమర్పించేందుకు ఇంట్లోనే వివిధ రకాల పూల చెట్లను పెంచుతుంటారు. అయితే.. పూజ కోసం వాడే పువ్వుల విషయంలో కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు పాటించాలని గురువులు చెబుతుంటారు.. అంతేకాక ఆధ్యాత్మిక గ్రంథాలలోనూ దేవుడికి సమర్పించే పువ్వులు, పూజా విధానాలపై రాసి ఉన్నాయి.

దేవుడి పూజకోసం వాసనలేని, ఘాటైన వాసన కలిగిన పువ్వులు, రెక్కలు లేని, వాడిపోయినవి, ముళ్లు ఉన్న పువ్వులను వాడకూడదంట. పవిత్రమైన ప్రదేశాల్లో పెరిగిన పువ్వులు.. సువాసన కలిగిన, పరిశుభ్రంగా తాజాగా ఉన్న పువ్వులతోనే పూజలో వాడాలి. ఎడమ చేతితో కోసిన పువ్వులు, సగం వికసించినవి. పురుగులు పట్టిన పువ్వులను అస్సలు పూజకోసం ఉపయోగించరాదని గ్రంథాలు చెబుతున్నాయి.

ఎక్కడ బడితే అక్కడ కొనుగోలు చేసిన పువ్వతో పూజల చేయరాదు. అందుకే ప్రతి గుడిలో స్వచ్ఛమైన పూలతో పూజలు చేస్తారు కాబట్టి గుడిలో అడుగుపెట్టిన వెంటనే సువాసన వెదజల్లుతోంది. అప్పుడే వికసించిన పువ్వులు తీసుకుని భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజచేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల అపార నమ్మకం. అందుకే కొందరు కేవలం పూజ చేసేందుకు ఇంటి ఆవరణలోని పరిశుభ్రమైన ప్రాంతంలో రకరకాల పూల మొక్కలు నాటుతారు. ఆ చెట్లకు పూసిన పువ్వులతోనే పూజలు చేస్తారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -