Devotional: గురువారం అటువంటి పనులు చేస్తే తీవ్ర నష్టాలు?

Devotional: భారతదేశంలో హిందువులు ఒక్కొక్క రోజున ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే ఆ రోజుల్లో దేవుడు పూజ చేయడంతో పాటు కొన్నిరకాల పనులు చేయడం వల్ల పూజ చేసిన ఫలితాలు దక్కకపోగా కష్టాలు, నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి గురువారం రోజున ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గురువారం దేవ గురువు బృహస్పతి విష్ణువు, అలాగే సాయిబాబాకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ హిందూమతంలో గురువారం కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు. కొన్ని రకాల పనులు చేయడం వల్ల దేవ గురు అయిన బృహస్పతి కి కోపం కలుగుతుంది.

 

గురువారం ఎటువంటి పనులు చేయకూడదు అంటే.. బట్టలు ఉతకడం, తల వెంట్రుకలు తొలగించడం లాంటివి చేయకూడదు. అలాంటి చేయడం వల్ల బృహస్పతికి కోపం వస్తుంది. అంతే కాకుండా కుటుంబంలో కష్టాలు సంక్షోభం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గురువారం రోజున అరటి పండ్లు తినకూడదు. ఎందుకంటే గురువారం రోజున అరటి చెట్టుని పూజిస్తారు కాబట్టి ఆ రోజున అరటిపండును తినకూడదు. గురువారం రోజు ఉపవాసం ఉన్నవారు అరటి పండ్లను అస్సలు తినకూడదు. అరటిపండును దేవుడికి సమర్పించవచ్చు. అలాగే గురువారం రోజున ఇంట్లో బూజు దులపడం ఇంటిని శుభ్రం చేయడం లాంటివి చేయకూడదు.

 

అలాగే గురువారం రోజున ఇంట్లో ఉన్న వస్తువులను అమ్ముకోవడం మానుకోవాలి. ఇంట్లో బూజు దులుపుకొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి అనుకున్న వారు శనివారం చేసుకోవడం మంచిది. శనివారం అలాంటి పనులు చేసుకోవడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది. గురువారం రోజున తలకు స్నానం చేయాలి అనుకున్న వారు జుట్టుకు సబ్బు షాంపు లాంటివి ఉపయోగించకపోవడం మంచిది. అలాగే గురువారం రోజున బట్టలు ఉతకడం అసలు మంచిది కాదు. గురువారం రోజున బట్టలు ఉతకడం వల్ల సంతోషం అదృష్టం తగ్గుతుంది. గురువారం రోజున గోర్లు వెంట్రుకలు కత్తిరించకూడదు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -