Dharmana Krishna Das: జగన్ మళ్లీ సీఎం కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. మాజీ డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్

Dharmana Krishna Das: ఏపీలో వైసీపీ నేతల రాజీనామాల అంశం చర్చనీయాంశంగా మారుతోంది. మూడు రాజధానులకు మద్దతుగా తాము రాజీనామా చేసేందుకు సైతం సిద్దమంటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటన మీద ప్రకటను చేస్తున్నారు. అంతేకాదు కొంతమంది అయితే రాజీనామా కూడా చేశారు. చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మూడు రాజధానులకుక మద్దతుగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మూడు రాజధానుల ఉద్యమం కోసం ఏర్పాటైన నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ కు అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ స్పీకర్ ఫార్మట్ లో చేయలేదని తెలుస్తోంది.

ఇక ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా రాజీనామా చేసేందుకుక సిద్దమయ్యారు. ఈ మేరకు సీఎం జగన్ ను స్వయంగా కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. కానీ రాజీనామా చేయవద్దని జగన్ వారించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే రాజీనామాపై ధర్మాన ప్రసాదరావు వెనక్కి తగ్గారు. మంత్రి పదవిని అయినా తాను త్యాగం చేయడానికి సిద్దమని, మూడు రాజధానులకు మద్దతుగా పోరాటం చేస్తానంటూ ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. మూడు రాజధాలను ఏర్పాట్లు వల్ల రాష్ట్రం అభివృద్ది చెందుతుందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతరికేస్తున్నాయో అర్ధం కావడం లేదన్నారు.

ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం, నర్సన్యపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలుస్తుందని, జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వ్యాఖ్యానించారు. జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను ఎమ్మెల్యేగా గెలిచినా ఆ పదవికి రాజీనామా చేస్తానంటూ ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు ఆషక్తికరంగా మారాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీదే గెలుపంటూ ఆయన జోస్యం చెప్పారు. జగన్ సమర్ధుడ నాయకుడని, వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుండా సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు.

ాజాగా శ్రీకాకుళం జిల్లా సావరకోట మండలంలుని చీడిపూడి గ్రామంలో ధర్మాన కృష్ణదాస్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 25 గ్రామాల అవరావతి ప్రజల కోసం కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరి ప్రయోజనాల కోసం మూడు రాజధానులను జగన్ తీసుకొస్తున్నారని ధర్మాన కృష్ణదాస్ పేర్నొన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు వంతపాడుతున్నారని, ఆయనపై ఇంకా రాజకీయ పరిణితి రాలేదని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసమే అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని చంద్రబాబు భవిస్తున్నారని ఆరోపించారు.

అయితే ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ఎవరైనా గెలవకపోతే ప్రతిజ్ఝలు చేస్తారు.. ఈయన ఏంటీ గెలిచినా రాజీనామా చేస్తారని అంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ధర్మాన కృష్ణదాస్ కొత్త ప్రయోగాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అసలు ఆయన ముందు గెలిచే ఛాన్స్ ఉందా అంటూ ప్రశ్నించారు. రాజీనామా సంగతి ఏమో కానీ ముందు ఆయన గెలచి చూపించాలని సూచిస్తున్నారు. నర్సన్నపేటలో టీడీపీ పుంజుకుందని, ధర్మాన కృష్ణదాస్ గెలిచే అవకాశం లేదని చెబుతున్నారు. అందుకే ధర్మాన కృష్ణదాస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారని కొంతమంది అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -