NTR: ఎన్టీఆర్ తో అన్నేళ్ల జయసుధ రొమాన్స్ చేశారా?

NTR: తెలుగు చలన చిత్ర రంగంలో మహారాజులా వెలిగిన మహనీయుడు ఎన్టీఆర్. అనేక సినిమాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే కొన్ని రోజులకు ఎన్టీఆర్ బాగా లావయ్యారు. ఆ టైంలో ఆయన పొట్ట బాగా కనిపించేది. ఎన్ని వ్యాయామాలు చేసినా తన పొట్టను ఆయన కప్పిపుచ్చుకోలేకపోయారు. ఆ సమయంలోనే జయసుధతో ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు పెద్దగా ఆడేవి కావు.

 

 

అయినా కూడా చాలా సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అలా న‌టించిన సినిమాలో యుగంధ‌ర్ సూప‌ర్ హిట్ విజయం సాధించింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్ కూడా చేయడం విశేషం. ఈ సినిమాలో పెద్ద‌గా డ్యూయ‌ట్లు లేక‌పోయినా, రొమాన్స్ సీన్లు లేకున్నా ఒకటి రెండు సీన్లు హాట్ గా ఉన్నాయి. అయితే వాటిని పండించేందుకు ద‌ర్శ‌కుడు చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.

 

ఎన్టీఆర్ వ‌య‌సు అప్ప‌టికే 50 ఏళ్లు కాగా జ‌య‌సుధ వ‌య‌సు అప్ప‌టికి కేవ‌లం 20లోపు ఉంది. దీంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ సీన్లు అంతగా పండేవి కావు. ముఖ్యంగా ఎన్టీఆర్ ముందు జ‌య‌సుధ చాలా బక్కగా కనిపించేది. అందుకే దర్శకుడు వారిని కవర్ చేయాలని చాలా ప్రయత్నించారు. అయినా అందులోని సీన్లు ఎక్క‌డా ఎబ్బెట్టుగా మాత్రం అనిపించేవి కావు.

 

సినిమా మొత్తంలో ఎక్క‌డా ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద‌గా డ్యూయెట్లు లేకుండానే సినిమా తీయడం విశేషంగా చెప్పొచ్చు. ఎన్టీఆర్ సోలో సాంగ్స్ ఎక్కువ‌గా చేసిన సినిమా కూడా ఇదేన‌ని టాక్‌ ఇప్పటికీ ఉంది. కాంబినేష‌న్ బాగున్నప్పటికీ సింగిల్ ఫ్రేమ్‌లోకి వ‌చ్చేస‌రికి మాత్రం కొంత ఇబ్బంది అనిపించిన సీన్ల‌ను స‌త్య‌నారాయ‌ణ‌తో క‌వ‌ర్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆ సినిమా కూడా మంచి విజయాన్నే అందుకుంది. ఎన్టీఆర్, జయసుధలకు హిట్ ఇచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -