Balayya: మైత్రీపై ఐటీ రైడ్స్ వల్ల బాలయ్య ఇంతలా నష్టపోయారా?

Balayya: ఈ ఏడాది మొదట్లో 2023 మైత్రి మూవీ మేకర్స్ కి బాగా కలిసి వచ్చిందని అందరూ సంతోషపడ్డారు. బాలకృష్ణ చిరంజీవి లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు తీయగా ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ అరుదైన రికార్డ్ మైత్రి నిర్మాణ సంస్థ దక్కించుకుంది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలువలేకపోయింది. ఇంతలోనే మైత్రి మూవీ మేకర్ సంస్థకు ఊహించని పరిణామం ఎదురయింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే.

ఈ సంస్థ వ్యాపార లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ, ఐటీ అధికారులు మైత్రీ మూవీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ అధినేతలైన నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవి శంకర్‌ ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు. మిర్చి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న పుష్ప 2 సినిమా దర్శకుడు సుకుమార్‌ కార్యాలయం, నివాసాల్లో కూడా మరొక బృందం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా తాజాగా వందరోజులు పూర్తి చేసుకుంది. వందరోజుల పండగని ఏప్రిల్ 23న నిర్వహిస్తామని ప్రకటించారు నిర్మాతలు. కానీ అంతలోనే ఐటీ దాడుల జరగడంతో ఈ వేడుకలని రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.

 

వంద రోజుల పండగ అనే సంతోష కార్యక్రమం కాస్త బాధగా మారిపోయింది. అలాంటి అరుదైన పండగని చూద్దామని ఆశలు పెట్టుకున్న నందమూరి ఫ్యాన్స్ కి మైత్రీ తాజా పరిమాణాలు నిరాశనే మిగిల్చాయి. అయితే మైత్రి మూవీస్ సంస్థపై ఐటి దాడులు నిర్వహించగా ఆ విషయంపై బాలకృష్ణ కూడా చాలా బాధను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ విషయం బాలయ్య బాబుని చాలా బాధించినట్టు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -