Kavitha: లిక్కర్ స్కాం ద్వారా కవితకు ఏకంగా ఆ రేంజ్ లో లాభాలొచ్చాయా?

Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత మీద లిక్కర్ స్కాం ఆరోపణలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు గురించి ఈడి అధికారులు కవితని విచారించారు. అయితే ప్రస్తుతం కవిత తన కాలు పాశ్చర్ అయిందని చెప్పి ఇంటి నుండి బయటకు రాకుండా విచారణకు వెళ్లటం లేదు. ఢిల్లీ కోర్టులో మేడే రోజున మూడో చార్జిషీటు దాఖలు చేశారు. అందులో కవిత గురించే ప్రధానంగా చెప్పారు.

కవిత ఎలా స్కాం చేశారు.. వచ్చిన డబ్బులతో ఎలా భూములు కొన్నారో కూడా వివరించడం సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం వల్ల వచ్చిన లాభాలతో కవిత భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఈడి వెల్లడించింది. అరుణ్ పిళ్లై సహాయంతో హైదరాబాద్ సహా ఇతర ప్రదేశాలలో అతి తక్కువ రేటుకి భూములు కొనుగోలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. భూముల కొనుగోలు లావాదేవీలన్నీ అరుణ్ పిళ్లై బ్యాంక్ ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది.

 

చార్జ్ షీట్ లో కవిత భర్త అనిల్ కుమార్ తో పాటు ఆమె సన్నిహితుల పేర్లను చేర్చింది. చార్జిషీట్‌లో సాక్ష్యాలుగా వాట్సాప్ చాట్ లు , ఈ మెయిల్స్ కూడా ఈడి జత చేసింది. చార్జి షీట్ లో ఫినిక్స్ శ్రీహరి పేరు, కవిత సన్నిహితులు వి శ్రీనివాస రావు, సృజన్ రెడ్డి పేర్లను చేర్చింది. కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని.. హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారు.

 

ఈ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది ఈడీ. అయితే విచారణ నుండి తప్పించుకోవటానికి ఇప్పటికిప్పుడు కవిత గాయం పేరుతో మ్యానేజ్ చేస్తున్నారు. మరో వైపు ఈడీ ఆఫీసుకు పిలవకుండా.. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌నే ప్రత్యేక సిట్ తో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్ పై త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan Nomination Rally: పిఠాపురంలో జనసునామి.. పవన్ కళ్యాణ్ ఊహించని మెజార్టీతో గెలవబోతున్నారా?

Pawan Kalyan Nomination Rally: రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే క్రమంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన వెనక వచ్చిన జన...
- Advertisement -
- Advertisement -