Manoj: అలా జరగడం వల్లే మనోజ్ కు బుద్ధి వచ్చిందా.. అసలేం జరిగిందంటే?

Manoj: భారీ అంచనాల మధ్య విడుదలైన ఆది పురుష్ సినిమా ఆఖరికి ఫ్లాప్ ని మూట కట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదల కాక ముందు నుంచి ఎన్నో విమర్శలని ఎదుర్కొన్నారు అయితే సినిమా విడుదలైన తర్వాత సినిమా గురించి ఇందులో ఉన్నటువంటి కొన్ని డైలాగ్స్ గురించి పలువురు సినీ సెలబ్రిటీలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

రామాయణాన్ని వక్రీకరించారని ఆధ్యాత్మిక అంశాలు కొరబడ్డాయని సంభాషణలు బాగా లేవని చాలామంది విమర్శించారు. ఈ విమర్శలపై ఈ సినిమా రచయిత మనోజ్ ముంతసిర్ అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు ఒకసారి అది రామాయణాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజధాని చెప్పారు. మరొకసారి రామాయణమే కానీ చిన్న చిన్న మార్పులతో సినిమా తీశామని చెప్పుకొచ్చారు.

 

భారతీయ ఇతిహాసాలను ఇలా చులకన చేస్తూ తీస్తారో అంటూ సినీ నిర్మాతలు దర్శకుని పోటు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది అలహాబాద్ కోర్టు. అదే సమయంలో డైలాగులు రాసిన మనోజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమా ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసిందా లేదా అన్నది సమీక్షించి అభిప్రాయాన్ని చెప్పేందుకు ఐదు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది.

 

దీనిపై శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించాడు మనోజ్. ఆది పురుష్ వల్ల ప్రజల భావోద్వేగాలు భారీగా దెబ్బతిన్నయని అందుకు తనను మన్నించాల్సిందిగా కోరాడు. రెండు చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెప్పినట్లు పేర్కొన్నాడు. తాను వాటిని కావాలని రాయలేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

 

ఆ హనుమంతుడు మనల్ని అందరినీ ఐక్యంగా ఉంచి మన పవిత్రమైన సనాతన గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక అని క్రియేట్ చేశాడు మనోజ్ ముంతాషిర్. అయితే ఈ పోస్ట్ పెట్టిన నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. క్షమాపణల కోరడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని చాలామంది భావిస్తున్నారు. కోర్టు చీవాట్లు పెట్టడం వల్లే మనోజ్ కి బుద్ధి వచ్చిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -