Prabhas: ప్రభాస్ సినిమాపై ఇంత ఘోరమైన ట్రోలింగ్ కు కారణమిదేనా?

Prabhas: టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ త్వరగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత అదే ఊపుతో వరుసగా పాన్ ఇండియా సినిమాలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే బాహుబలి తరువాత ప్రభాస్ ఆదిపురుష్, రాధే శ్యామ్, సాహో లాంటి సినిమాలలో నటించినప్పటికీ ఆ మూడు సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విధంగా ఘోరమైన డిజాస్టర్ ను చవి చూసాయి. అయితే మామూలుగా వందల కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టి సినిమాలను తీస్తున్నప్పుడు సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరించడం మంచిది.

ఎందుకంటే పాన్ ఇండియా సినిమా విడుదల అవుతుంది అంటే పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఇకపోతే హీరో ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వందల కోట్ల బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాలను రూపొందించారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే ప్రాజెక్ట్ సినిమా నుంచి లుక్ ని విడుదల చేయగా ప్రాజెక్ట్ కె ఫస్ట్ లుక్ మీద సోషల్ మీడియాలో నెగటివిటీ వచ్చిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. హాలీవుడ్ సంస్థ మార్వెల్ సిరీస్ సూపర్ హీరో గెటప్ కి ప్రభాస్ తల అతికించినట్టు ఉందని ఓపెన్ గానే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

దాన్ని రకరకాలుగా జూమ్ చేసి చిత్ర విచిత్రమైన ఎనాలిసిస్ చేస్తున్న వాళ్ళు వందల్లో ఉన్నారు. అసలే ఇది ఫాంటసీ మూవీ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని షూటింగ్ మొదలైనప్పటి నుంచి టీమ్ తెగ ఊరిస్తోంది. దానికి తగ్గట్టు ఫ్యాన్స్ ఆశించడం తప్పేమీ కాదు. బాహుబలి తర్వాత దాన్ని మించే విజయాన్ని ప్రభాస్ అందుకోలేదు. మార్కెట్ పెరుగుతోంది కానీ సక్సెస్ గ్రాఫ్ కాదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ మూడు కాస్ట్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. సలార్ టీమ్ సైతం టీజర్ లో హీరో మొహం చూపించకుండా దోబూచులాడి యూట్యూబ్ వ్యూస్ రికార్డు దక్కించుకుంది కానీ అభిమానుల మనసులు కాదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో అంతు చిక్కని విషయం. బాలీవుడ్ మీడియా మన మీద ఓరకంటగా చూస్తోంది. తమని డామినేట్ చేస్తున్న దక్షిణాది ఫిలిం మేకర్స్ ని దొరకబుచ్చుకోవాలని చూస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఖాన్లు నటించిన డిజాస్టర్లను ఆకాశానికెత్తి మనవి రిలీజైనప్పుడు మాత్రం తప్పులు వెతికే పనిలో పడుతున్నారు. కేవలం సందీప్ రెడ్డి వంగా తీశాడనే కారణంతోనే కబీర్ సింగ్ ని తొక్కేయాలని చూశారు కానీ పనవ్వలేదు. ప్రాజెక్ట్ కె క్రేజ్ నాగ అశ్విన్, అశ్వినిదత్ ల వల్ల రాలేదు. ప్రభాస్ అనే బ్రాండ్ నుంచి పుట్టింది. దాన్ని వీలైనంత ఎక్స్ పోజ్ చేస్తేనే జనం థియేటర్లకు పోటెత్తడానికి ప్రిపేర్ అవుతారు. ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి అనుసరించిన స్ట్రాటజీ చూశాంగా. చిన్న టీజర్ తో మొదలుపెట్టి మీడియా ప్రమోషన్ల దాకా ఆయన తీసుకునే శ్రద్ధ అపారం. అందుకే స్టేజిలు దాటేకొద్దీ హైప్ ఆకాశాన్ని దాటిపోయింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -