Adipurush: ఆదిపురుష్ మూవీకి భారీ నష్టాలు గ్యారంటీగా వస్తాయట.. కానీ?

Adipurush: ప్రభాస్ ఆది పురుష్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు దినదిన గండంగా మారింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకొని ఈ సినిమాని భారీ ధరలకు కొనుగోలు చేశారు. అయితే మొదటి వారం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ తో భారీ కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే తర్వాతి రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి.

 

ఇక ఈ సినిమా విడుదలకు ముందు నుంచి ఎన్నో వివాదాలను విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే సినిమా విడుదలైన తర్వాత కూడా మిశ్రమ స్పందన లభించడమే కాకుండా ఈ సినిమాలో నటించిన నటీనటుల పట్ల కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనికి తోడు దర్శకుడు అలాగే రచయిత చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా సినిమాకు మైనస్ అయ్యాయి.

ఇలా ఈ సినిమాకు వచ్చినటువంటి నెగెటివిటీ ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించలేకపోతోంది దీంతో భారీ స్థాయిలోనే నష్టాలు ఏర్పడిపోతున్నాయని పలువురు భావిస్తున్నారు.ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే దాదాపు 75 కోట్ల రూపాయల వరకు వసూలు రాబట్టాల్సి ఉందని అయితే అది సాధించడం చాలా కష్టమేనని తెలుస్తుంది.

 

ఇక ఈ వారంలో కూడా ఏ విధమైనటువంటి సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు దీంతో ఆది పురుష్ సినిమా మాత్రమే అన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతుంది. ఇలా ఈవారం వసూళ్ళతో కాస్తలో కాస్తయినా నష్టాల నుంచి బయటపడి మార్గాలు ఉన్నాయని తెలుస్తుంది. మొత్తానికి ఆదిపురుష్ ఫ్లాప్ నుంచి డిజాస్టర్ కు మధ్యలో ఎక్కడో ఒక చోట నిలవడం ఖాయమేనని పలువురు సినీ విమర్శకులు తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -