Nayanthara: అన్నీ చేసినా నయనతార అందుకే హ్యాండ్ ఇచ్చిందా?

Nayanthara: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా నయనతారకు పేరుంది. ఆమె సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ దక్కించుకుందో వ్యక్తిగత లైఫ్ లో కూడా అంతే క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోలతో నయనతార ప్రేమాయణం నడిపి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత వారితో బ్రేకప్ చేసుకోవడం అన్నీ కూడా హాట్ టాపిక్ గా మారడం అందరికీ తెలిసిందే. మొదట్లో కోలీవుడ్ హీరో శింబుతో ఆమె ప్రేమలో పడింది. అయితే అతడితో విభేదాలు రావడంతో ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు.

 

కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వీరు కూడా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు. వీరు విడిపోవడానికి కారణం మాత్రం ఇంత వరకూ తెలియలేదు. అయితే ప్రభుదేవా మొదటి భార్య వల్లే వీరిద్దరూ విడిపోయి ఉంటున్నారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ప్రభుదేవా ఆదేశం మేరకు క్రిస్టియన్ అయిన నయనతార హిందువుగా కూడా మారిపోయి షాక్ ఇచ్చింది. ప్రభుదేవా నయనతారకు చాలా కండిషన్స్ పెట్టేవాడని, ఆమెపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించాడని, అందుకే నయనతార ప్రభుదేవాకు దూరమైందని తెలుస్తోంది.

 

ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రేమ, పెళ్లి అనే పదాలకు నయనతార దూరం అయ్యింది. స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత ఈమె అభిమాని అయిన ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కూడా ప్రేమాయణం నడిపింది. 2015లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన నానుం రౌడీ తాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా అప్పుడే వీరు ప్రేమలో పడ్డారు.

 

ఇక అక్కడి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు సరోగసి ద్వారా వీరు తల్లిదండ్రులు అయ్యారు. పెళ్లి తర్వాత కూడా తగ్గేదేలే అంటూ నయనతార వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.8 కోట్లకు పైగా పారితోషికాన్ని ఈమె డిమాండ్ చేయడం విశేషం. తన స్టార్ డమ్ ను మరింత పెంచుకునేలా నయనతార ప్రయత్నాలు చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -