Niharika: ఆ టాలీవుడ్ హీరోయిన్ వల్లే నిహారిక విడాకులు తీసుకుందా?

Niharika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు జొన్నలగడ్డ చైతన్య, నిహారిక. గత కొంతకాలంగా ఈ జంట విడిపోబోతున్నారు అంటూ అనేక రకాల వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఈ విషయంపై అటు చైతన్య కానీ ఇటు నిహారిక కానీ స్పందించలేదు. నిహారిక ఎక్కడికి వెళ్లినా కూడా ఇందుకు సంబంధించిన ప్రశ్నలు వినిపించగా ఆ ప్రశ్నలను ఎప్పటికప్పుడు దాటి వేస్తూ వచ్చింది. మొన్నటికి మొన్న నిహారిక అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకకు కూడా జొన్నలగడ్డ చైతన్య హాజరు కాకపోవడంతో అభిమానులు కారణం ఏంటా అని ప్రశ్నించినా కూడా నిహారిక స్పందించలేదు.

మొత్తానికి సోషల్ మీడియాలో వినిపించిన వార్తలన్నింటికీ చెక్ పెడుతూ నిహారిక, చైతన్య విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి విడాకులకు సంబంధించిన పిటిషన్ బయటకు వచ్చింది. వీరిద్దరూ విడాకులు కోరుతూ కూకట్‌ ప‌ల్లి ఫ్యామిలీ కోర్టులో అప్లై చేసిన డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరు విడాకులు తీసుకుని నెల రోజులు దాటుతుందని కూడా తెలుస్తోంది. అలాగే నిహారిక కూడా భర్త చైతన్యతో మానసికంగా ఎప్పుడో దూరమైందట. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం… నిహారిక విడాకులు తీసుకోవడానికి టాలీవుడ్ లో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ కారణం అంటూ ఇప్పుడు సరికొత్త వార్త బయటకు వచ్చింది.

 

ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు సమంత. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత తన భర్త స్టార్ హీరో నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కేవలం సమంత ఈ గ్లామర్ ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించేందుకే ఫ్యామిలీ బంధాన్ని తెంచుకుందన్న పుకార్లు అప్పట్లో బయటకు వచ్చాయి. ఇప్పుడు నిహారిక కూడా సమంతను స్ఫూర్తిగా తీసుకున్న నిహారిక ఈ గ్లామర్ ప్రపంచంలో తనకు నచ్చినట్టుగా తాను ఉండేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
దానికి తోడు ఈ మధ్యకాలంలో నిహారిక తీరు కూడా అలాగే ఉండడంతో ఈమె నిజంగానే గ్లామర్ పెయింట్ ప్రపంచంలో స్వతంత్రంగా విహరించాలని చూస్తోంది అని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -