Pawan: జగన్ పై పగతోనే పవన్ రాజకీయాల్లోకి వచ్చారా.. ఏం జరిగిందంటే?

Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతికి కనుక మైక్ దొరికితే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తనకే తెలియదు.నిన్న మాట్లాడిన మాటలపై రేపటికి నిలకడ ఉండదు. రేపు ఆ విషయం గురించి మరొక మాట మారుస్తూ పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు.ఇక ఉన్నఫలంగా ఢిల్లీ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ మోడీ పరిపాలనను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఢిల్లీ వెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలి అంటే ఒక పదేళ్ల సమయం పడుతుందని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన ప్రగతిని ముందుకు తీసుకెళ్లడానికి, మోడీ కన్న కలలు కార్యరూపం పూర్తి చేయడానికి, దేశ ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా జరగాలి అంటే మోడీకి మరో అవకాశం ఇవ్వాలని ఈయన తెలిపారు. ఇప్పటికే 10 సంవత్సరాల పాటు పాలనలో ఉన్నటువంటి మోడీ మరో ఐదు సంవత్సరాలు కొనసాగితేనే అభివృద్ధి జరుగుతుందన్నది ఇక్కడ పవన్ ఉద్దేశం.

 

పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వం కోణం నుంచి కనక చూస్తే.. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడం కోసం చాలాకృషి చేయాల్సి ఉంటుంది అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా ఎన్నో అప్పులను మిగిల్చి అధికారం నుంచి దిగిపోయారు.అనంతరం జగన్ వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు.

 

నాడు నేడు పథకం కింద హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజీలు రోడ్లను బాగు చేస్తూ ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి తీసుకొస్తున్నారు. అయినప్పటికీ వచ్చే ఎన్నికలలో జగన్ ను అధికారం నుంచి దించేయాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు ప్రధానమంత్రి మోడీ అభివృద్ధి చేయాలంటే 15 సంవత్సరాల సమయం అడిగినటువంటి పవన్ ఏపీ అభివృద్ధి చేయడం కోసం జగన్ కి కనీసం 10 సంవత్సరాల సమయం కూడా ఇవ్వలేరా..ఈ విషయంలో మోడీకి ఒక రూలు జగన్ కి ఒక రూల అంటూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ విషయంలో మండిపడుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -