Anasuya: అనసూయ చేతిలో చెయ్యేసి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న దర్శకేంద్రుడు!

Anasuya: బుల్లితెర పై ప్రసారమవుతున్న క్యాష్ కార్యక్రమానికి ఏలాంటి ప్రేక్షకాదరణ ఉందో మనకు తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని సుమ ఒంటి చేతితో ముందుకు నడిపిస్తున్నారు.ప్రతివారం ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరవుతూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి వాంటెడ్ పండుగాడ్ చిత్ర బృందం హాజరయ్యారు. ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమా ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

తాజాగా ఈవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి యశ్వంత్ మాస్టర్, అనసూయ, విష్ణు ప్రియ, నిత్య శెట్టి, రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఇకపోతే ఈ కార్యక్రమాల్లో రాఘవేంద్రరావు అనసూయ ఎంట్రీ అదిరిపోయిందని చెప్పాలి. అనసూయ రాఘవేంద్రరావు ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మెట్లు ఎక్కుతూ పైకి వచ్చారు.

అదేంటి సార్ అలా అనసూయ చేయని పట్టుకొని వచ్చారు అంటూ సుమ ప్రశ్నించడంతో రాఘవేంద్రరావు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాలేజీ రోజుల్లో అనసూయ అనే అమ్మాయి ఉండేది.తనపై ఉన్న ప్రేమను అలాగే దాచుకున్నాను అయితే ఇప్పుడు ఈ అనసూయ కనిపించడంతో అలా చేతిలో చేసి వేసి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాను అంటూ వెల్లడించారు. రాఘవేంద్రరావు ఇలా అనడంతో మీ జీవితంలో సుమా అనే పేరు గల అమ్మాయి లేదు కదా సార్ అని ప్రశ్నించారు.

సుమ లేని జీవితం ఎవరికైనా ఉంటుందా అంటూ మరోసారి రాఘవేంద్రరావు అనడంతో ఒక్కసారిగా నవ్వులు పువ్వులు పూసాయి.అనంతరం దర్శకేంద్రుడు మాట్లాడుతూ మీ పెళ్లి కూడా నేనే కదా చేసింది అని అనడంతో వెంటనే సుమ ఆ పాపం మీదే కదా సార్ అంటూ తనపై సెటైర్ వేశారు. మొత్తానికి ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు కాలేజీ కుర్రాడిలా మారిపోయి సందడి చేశారని చెప్పాలి.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -