Pamidi: డబ్బు కోసమే రాజేశ్వరి అలాంటి పనులు చేసిందా?

Pamidi: ఈనెల 10వ తేదీ అనంతపురం జిల్లా పామిడి మండలంలోని ఎద్దులపల్లి రోడ్డు రైల్వే గేట్ ఎల్ సి 143 సమీపంలోరైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం లభిమైన విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ మొండెం మాత్రమే ఉండి తల లేకపోవడంతో ఈ కేసును చేదించడానికి పోలీసులు చాలా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేశారు అయితే ఎట్టకేలకు ఈ కేసును పోలీసులు చేదించి అసలు విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా మృతి చెందిన వ్యక్తి జొన్నగిరికి చెందిన శంకర్ నాయక్ అనే విషయం బయటపడింది.శంకర్ నాయక్ వడ్డీ వ్యాపారి కావడంతో ఈయన ఇచ్చిన అప్పులు తిరిగి చెల్లించుకునే క్రమంలో రాజేశ్వరి అనే మహిళను లోబరుచుకొని తన కోరికలు తీర్చుకునేవారు అయితే ఆయన వేధింపులు ఎక్కువైన నేపథ్యంలోనే తనని హత్య చేశామంటూ స్వయంగా రాజేశ్వరి ఒప్పుకోవడంతో ఈ కేసుకు పుల్ స్టాప్ పడింది.రామగిరి గ్రామానికి చెందిన నారాయణ నారాయణమ్మ దంపతుల కుమార్తె రాజేశ్వరిని జొన్నగిరికి చెందిన కేశవయ్యకు ఇచ్చే వివాహం చేశారు.

 

కరోనా సమయంలో కేశవయ్య మరణించడంతో ఈమెకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలోనే శంకర్ నాయక్ అనే వ్యక్తి వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకుంది. అప్పు చెల్లించని నేపథ్యంలో శంకర్ నాయక్ తన వద్దకు వెళ్లి తనని డబ్బు చెల్లించాలని బెదిరిస్తూ తనని శారీరకంగా లోబరుచుకున్నారు.ఇక ఈ విషయం తెలిసిన శంకర్ నాయక్ భార్య రాజేశ్వరి ఇంటి వద్దకు వెళ్లి గొడవ పడడంతో ఆమె తన పుట్టింటికి చేరుకుంది. పుట్టింటికి వెళ్ళిన శంకర్ నాయక్ తనని ఇబ్బంది పెట్టేవాడు.

 

ఇక తన బాధలు భరించలేక తన తల్లితో కలిసి రాజేశ్వరి తనని హత్య చేయడానికి ప్రయత్నం చేసింది ఈ క్రమంలోనే శంకర్ నాయక్ను రామగిరికి రప్పించి కత్తితో తన గొంతు కోసినట్లు పోలీసుల నిర్ధారణలో రాజేశ్వరి ఒప్పుకున్నారు. అయితే తల మొత్తం తెగిపోలేదని తల కొంత భాగం మొనడానికి అతుక్కొని ఉందని ఈమె తెలియజేశారు. అయితే తల కనిపించకపోవడంతో తల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి వడ్డీ వ్యాపారితో అక్రమ సంబంధమే ఆయన మరణానికి కారణమైందని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -