Dr. Samaram: ప్రతి మగవారు ఈ విషయాలు తెలుసుకోవాలా.. సమరం అలా చెప్పారా?

Dr. Samaram: చాలామంది పురుషులు స్త్రీలలో అనుమానించి ఒకే ఒక విషయం ఏమిటంటే స్త్రీ కన్యగానే ఉందా? ఈ అనుమానం దాదాపుగా 75 శాతం మంది పురుషులలో కలుగుతూ ఉంటుంది. పెళ్లి చేసుకున్న తరువాత స్త్రీ కన్య నా కాదా అని తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇంకా చాలామంది పురుషులు పెళ్లి కాకముందే స్త్రీల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అంటే పెళ్లి కాకముందే స్త్రీలు కన్య కాదా అని తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటారు. అయితే ఇదే విషయంపై స్త్రీలు అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మగవారితో వేధింపులను సైతం ఎదుర్కొంటూ ఉంటారు.

అయితే ఈ విషయంపై డాక్టర్ సమరం సమాధానం ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే.. డాక్టర్ గారు ఒక స్త్రీ పెళ్లికాకముందు కన్య కాదు అని తెలుసుకోవడం ఎలా అని అడగగా.. తెలియదు.. తెలుసుకోలేము. ఉదాహరణకు మగవారు పెళ్లికి ముందే ఇతరులతో సెక్స్ లో పాల్గొంటే ఆ విషయం కనిపెట్టవచ్చా అంటే అది కూడా చెప్పలేం. పెళ్లికి ముందు స్త్రీ కన్య కాదా అని తెలుసుకోవడం ఎందుకు అంటే అది పురుష అహంకారం, ఎందుకు ఆ విధంగా తెలుసుకోవాలి అంటూ డాక్టర్ సమరం ప్రశ్నించారు. ఎక్కడైనా కూడా ఒక పురుషుడు పెళ్లికి ముందే ఇతర ఆడవారితో సెక్స్ చేసిన విషయం గురించి అడుగుతున్నారా లేదు కదా అలాంటప్పుడు స్త్రీని మాత్రమే ఎందుకు ఆ విధంగా ప్రశ్నించాలి అని తెలిపారు డాక్టర్ సమరం.

 

కానీ అలా తెలుసుకోవడం అలా మాట్లాడడం చాలా తప్పు. తెలుసుకోవడానికి కూడా ఆస్కారం లేదు. కన్నెపొర ద్వారా స్త్రీ కన్య నా కాదా అని తెలుసుకోవచ్చు అనుకుంటారు అలా తెలుసుకోలేము అది అబద్ధం అని తెలిపారు. పెళ్లికి ముందే స్త్రీ ఇతరులతో కలిసిందా లేదా అన్నది తెలుసుకోవడం తప్పు అసలు ఆ ఆలోచన రావడమే తప్పు అని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -