Shruti Haasan: నందమూరి హీరోలను శృతి హాసన్ ముంచేసిందా?

Shruti Haasan: స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి శృతి హాసన్ అడుగుపెట్టింది. కెరీర్ మొదట్లో ఆమె నటించిన అనేక సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆమెకు చాలా మంది ఐరెన్ లెగ్ అనే పేరును ఖరారు చేశారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమా హిట్ అందుకోవడంతో ఆమె ఏకంగా కమర్షియల్ హీరోయిన్ అయ్యింది. హిందీ, తమిళంలో సినిమాలు చేసినా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ఫస్ట్ హిట్ అందుకుని ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

 

గబ్బర్ సింగ్ తర్వాత శృతి తెలుగులో మంచి సినిమాలు చేస్తూ వస్తోంది. ఆ సినిమా తర్వాత శృతి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు త‌మిళ ఇండ‌స్ట్రీని కూడా ఏలుతూ వస్తోంది. అయితే, ఇప్పుడు శృతి హాసన్ నటించిన రెండు సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం విశేషం. వాటిలో ఒకటి నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరిసింహారెడ్డి సినిమా కాగా, మరొకటి మెగాస్టార్ చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించిన వాల్తేరు వీరయ్య.

 

బాలయ్య కూడా క్రాక్ కాంబినేషన్ కావడంతో శృతి గురించి గోపీచంద్ చెప్పగానే నో చెప్పకుండా పచ్చజెండా ఊపారు. వీర‌సింహారెడ్డికి మంచి హిట్ టాక్ వ‌చ్చినా హీరోయిన్ ప‌రంగా కాస్త మైన‌స్సే అయ్యిందని చెప్పాలి. బక్కపలచని శృతి హాసన్ తెర మీద బాలయ్య పక్కన అంత గొప్పగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

అయితే ఇందులో శృతీని కూడా పూర్తిగా త‌ప్పు ప‌ట్ట‌లేమని, వీర‌సింహాలో శృతి క్యారెక్ట‌ర్‌కు అంత స్కోప్ కూడా లేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. కథ, స్క్రీన్ ప్లేలో కొన్ని లోపాలున్నా అన్నిటికంటే ఎక్కువగా మైనస్ అయింది శృతి హాసన్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు వినిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాలో శృతి పాత్ర కంటే హానీరోజ్ పాత్రే హైలెట్ అయ్యిందని చాలా మంది చర్చించుకుంటున్నారు.

 

గతంలో రామయ్య వస్తావయ్యా సినిమాలో తారక్ తో శృతీ హాసన్ జతకట్టింది. అయితే ఆ సినిమా కూడా డిజాస్టరే అయ్యిందని చెప్పాలి. ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా కూడా అదేవిధంగా జరిగింది. దీంతో అప్పుడు అబ్బాయిని, ఇప్పుడు బాబాయ్ ని శృతీ దెబ్బకొట్టేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి హీరోలను ఈ హీరోయిన్ ముంచేసిందని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -