Somu Veerraju: సోము వీర్రాజు చీటీ చించేశారా.. ఆయనకు అవకాశం ఇస్తున్నారా?

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా సంచలనంగా మారుతూ ఉంటాయి. వైసీపీ,తెదేపా పార్టీల మధ్య కాకుండా పవన్ కళ్యాణ్ జనసేన బిజెపి పార్టీల వ్యవహార శైలి కూడా తరచూ సంచలనంగా మారుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను కలిసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన బిజెపితోను తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి మాట్లాడటం కోసమే ఢిల్లీ వెళ్లారనే వార్తలు వచ్చాయి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెళ్లిన తరువాత ఆంధ్రప్రదేశ్ బిజెపి రాజకీయాలలో పలుమార్పులు చోటుచేసుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పదవికి గండం వచ్చింది. కొన్ని రోజుల వ్యవధిలో ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవినుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయనకు తెలియజేయడం కోసమే సోము వీర్రాజును హుటాహుటిన శనివారం ఢిల్లీ పిలిపించారని సమాచారం.

ఇక పవన్ డిల్లి వెళ్లినప్పుడు సోము వీర్రాజు కారణంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీవ్రమైన నష్టం ఏర్పడుతుందని తెలియజేయడంతోనే ఈయనపై చర్యలకు అధిష్టానం సిద్ధమైందని తెలుస్తోంది.ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సైతం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.ఇక రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపించడం కోసం సోము వీర్రాజుకు దిశా నిర్దేశం చేయడం కోసం ఈయనని హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీలో సోమూ వీర్రాజును పదవి నుంచి తప్పించబోతున్నారని తెలుస్తుంది. మరి ఈయనని తప్పిస్తే మరి కొత్త చీఫ్ ఎవరు అనే విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. నల్లారి కిరణ్ ఇంకా ఢిల్లీలోనే తిష్టవేసి అమిత్ షా వంటి పెద్దలతో కలవనున్న నేపథ్యంలో బహుశా ఈయనకు చీఫ్ గా బాధ్యతలను అందజేస్తారని ఊహగానాలు వినపడుతున్నాయి. అయితే సోము వీర్రాజు తప్పించి ఏపీ పార్టీ సారథ్య బాద్యతలను ప్రస్తుత జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేతిలో పెడతారని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ఈ విషయం గురించి అధిష్టానం నుంచి పిలక నిర్ణయం రాబోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -