Tarak: రాజకీయాల గురించి తారక్ అలా చెప్పారా?

Tarak: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న యంగ్, ట్యాలెంటెడ్ హీరో యంగ్ టైగర్ తారక్. దర్శక ధీరుడు రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ చేసిన తారక్.. ఈ సినిమాతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కార్యక్రమానికి హాజరైన నందమూరి యువ హీరో.. అక్కడ తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకున్నాడు.

టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డంని, వేరే ఏ యంగ్ హీరోకు సాధ్యంకాని రికార్డులను ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం సినిమాల వరకే కాకుండా ఎన్టీఆర్.. రాజకీయ నేపథ్యం కూడా కలిగి ఉండటం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు హవా కొనసాగించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థకులు స్వర్గీయ ఎన్టీ రామారావు మనవడిగా తారక్ కు కూడా పార్టీలో, పార్టీ అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంది.

ఏపీలో జరిగిన ఓ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేయగా.. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా తారక్ పార్టీ పగ్గాలు చేపట్టాలని, పార్టీలో ఉంటే తిరిగి పూర్వవైభవం సాధ్యమని తెలుగుదేశం పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ కి మాత్రం రాజకీయాలు ఇష్టం లేదని, సినిమాలు మాత్రమే చేసుకోవాలని ఉందనే వార్త ఆ మధ్యన చక్కర్లు కొట్టింది.

అయితే తాజాగా రాజకీయాల గురించి ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను రాజకీయాలలోకి వస్తానని, కాకపోతే సరైన సమయంలో వస్తానని ఎన్టీఆర్ సన్నిహితులతో అన్నట్లు సమాచారం. అలాగే తన రాజకీయ రంగ ప్రవేశం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారం మీద ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -