Nandamuri Family: నందమూరి కోడలు కావాలని ఆ హీరోయిన్ ఆశ పడిందా?

Nandamuri Family: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విశ్వవిఖ్యాత నటులు సీనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి ఈ గౌరవం, గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. హాలీవుడ్ ప్రముఖులు కూడా నందమూరి అనే పదం వినగానే చేతులెత్తి దండం పెడతారు. అంతలా నందమూరి తారక రామారావు కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టారు. చాలా మంది హీరోయిన్లు నందమూరి హీరోల సరసన నటించేందుకు ఇష్టపడుతుంటారు. అదే సందర్భంలో నందమూరి హీరోలతో నటించిన హీరోయిన్లు వారిని పెళ్లి చేసుకునేందుకు బాగా ఇంట్రెస్ట్‌ చూపారట. అలా చూపిన హీరోయిన్‌ ఎవరో చూద్దాం.

 

 

తన నటనతో ఊర్రూతలూగించే నందమూరి నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చేసి ప్రపంచ స్థాయి నటుడిగా ఎదిగిగాడు. ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో మూవీస్‌ చేస్తున్నాడు. అయితే నందమూరి కోడలు అవ్వాలని జూనియర్ ఎన్టీఆర్‌తో గాసిప్స్ వచ్చేలా ట్రై చేసింది అప్పట్లో ఓ హీరోయిన్. అంతేనా హద్దులు మీరు నటించింది. అప్పట్లో ఆ హీరోయిన్ ఎన్టీఆర్‌తో నడిపిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ సమీరారెడ్డి. నందమూరి ఎన్టీఆర్‌తో సినిమాల్లో నటించే టైంలోని తనపై గాసిప్స్ వచ్చేలా తారక్‌తో ప్రవర్తించిన సమీరారెడ్డి.. నందమూరి ఇంటికి కోడలుగా కావాలని తెగ ట్రై చేసిందట. నందమూరి హీరోకు ప్రపోజ్ కూడా చేసిందట.

 

సమీరా నిజంగానే నందమూరి హీరోను ప్రేమించిందని..కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో తమపై గాసిప్స్ వచ్చేలా ప్రవర్తించింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇదే విషయం తెలుసుకున్న హరికృష్ణ..ఆమెకి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారట. ఆడపిల్ల జీవితం చాలా సెన్సిటివ్..నువ్వు నా కూతురు లాంటి దానివి.. తారక్‌కి నిజంగా ఇష్టం ఉంటే..నేనే నిన్ను కోడలుగా చేసుకునే అని చెప్పాడట. వాడికి అలాంటి ఆలోచన లేదని, ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో అంటూ పరోక్షకంగా వార్నింగ్ ఇచ్చేలా సమీరా రెడ్డిని భయపెట్టారట. ఈ క్రమంలోని అమ్మడు టాలీవుడ్‌లో సినిమాలు చేయడమే ఆపేసింది.

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -