Heroine: ఆ హీరోయిన్ వందల కోట్ల రూపాయల ఆస్తిని సాయిబాబాకు రాయించిందా?

Heroine: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల రూపాయి రూపాయి పోగు చేసి పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెడతారు. ఇలా వారు వారి పిల్లలు వారి పిల్లలు కూడా సంతోషంగా ఉండడం కోసం కష్టపడుతూ ఆస్తులను కూడబెడుతూ ఉంటారు. అయితే మరి కొంత మంది మాత్రం సంపాదించినది మొత్తం సంపాదించిన విధంగానే ఖర్చు చేస్తూ చివరి క్షణాలలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ మరణించిన వారు కూడా ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి అంజలీదేవి మాత్రం ఇందుకు చాలా భిన్నం ఈమె సినిమాలలో సంపాదించినది మొత్తం అదనపు ఖర్చులు చేయకుండా భద్రంగా దాచి పెట్టి భారీగా ఆస్తులు కూడా పెట్టారు. ఇక ఈమె సంగీత దర్శకుడు ఆదినారాయణను పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ గా నటించడమే కాకుండా నిర్మాతగా సినిమాలు కూడా నిర్మించారు.

 

ఇలా ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం భద్రంగా దాచిపెట్టిన ఈమె తన భర్త మరణంతో పూర్తిగా మారిపోయారు.ఇలా తన భర్త మరణించిన తర్వాత ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే వారు. అలాగే షూటింగ్ లొకేషన్లో తనకు ఏదైనా ప్రత్యేకమైన రోజు కనుక ఉంటే అందరికీ ఫైవ్ స్టార్ భోజనం చేయించేవారు.ఇక చివరి రోజుల్లో ఈమె ఎక్కువగా షిరిడి సాయిబాబా పుట్టపర్తి సాయిబాబాను నమ్ముకుని అక్కడే కాలం వెళ్లదీశారు.

 

ఇక ఈమె సంపాదించిన ఆస్తిని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పిల్లలకు, మరొక భాగం పుట్టపర్తి సాయిబాబాకు, మరొక భాగం షిరిడి సాయిబాబాకు దానంగా ఇచ్చారు. ఇలా వందల కోట్ల ఆస్తిని ఈమె సాయిబాబాకు విరాళంగా ప్రకటించారు. బాబాపై ఎంతో భక్తిని పెంచుకున్నటువంటి ఈమె కుటుంబ బాధ్యతలను పిల్లలకు అప్పచెప్పి ఎక్కువగా షిరిడి, పుట్టపర్తి ప్రాంతాలలోనే నివసిస్తూ తన ఆస్తులను కూడా సాయిబాబా మందిరానికి రాసిచ్చారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -