Gopichand: ఆ ప్రోమో గోపీచంద్ ను ఎంతగానో బాధ పెట్టిందా?

Gopichand: సాధారణంగా ఏదైనా ఒక సినిమా విడుదలవుతుంది అంటే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమా కెరియర్ గురించి ఆ సినిమా గురించి వారి వ్యక్తిగత విషయాల గురించి సెలబ్రిటీలో ప్రస్తావిస్తూ ఉంటారు. ఇలా మీడియా సమావేశాలలో పాల్గొంటూ ఉంటారు అలాగే మరికొందరు ఇతర డైరెక్టర్లతోనూ యాంకర్లతోనూ ఇంటర్వ్యూలో నిర్వహిస్తూ ఉంటారు.

ఇలా యాంకర్ల చేత ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తప్పనిసరిగా మేకర్స్ వారికి డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకుంటారు.అయితే ఇలాంటి ఇంటర్వ్యూలలో హీరోలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండే ప్రశ్నలను మాత్రమే అడుగుతారు అలాగే వారి గురించి నెగిటివ్ ప్రశ్నలు అడిగి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకుంటారు. అయితే మరి కొంతమంది కొన్నిసార్లు సూటి ప్రశ్నలు అడుగుతూ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు.

 

తాజాగా ఇలాంటి ఇబ్బందులకు నటుడు గోపీచంద్ గురయ్యారని తెలుస్తుంది.తాజాగా ఈయన రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మే 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే గోపీచంద్ కెరీర్ ను మలుపు తిప్పిన డైరెక్టర్ తేజ గారితో ఈయన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇక తేజ గారి మాట తీరు ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఎదుట ఎవరూన్నా సరే తను అడగాల్సింది అడిగే మనస్తత్వం తేజ గారిది.

 

ఈ క్రమంలోనే గోపీచంద్ స్ట్రైట్ గా ప్రశ్నలు వేస్తూ తనని ఇబ్బందులకు గురి చేశారని తెలుస్తోంది.నేను ఓ సినిమా కోసం నీకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు సినిమా కూడా చేయలేదు అంటూ తేజ సూటిగా ప్రశ్నించారు. అలాగే మీ నాన్న ఇండస్ట్రీలో చాలా గొప్పోడు మరి ఇండస్ట్రీకి వచ్చి నువ్వేం పీకావ్ అంటూ తేజ ముఖం మీదే ప్రశ్నలు వేశారు. దీంతో ఈ ప్రోమో కాస్త వైరల్ అయింది.అయితే డైరెక్టర్ తేజ ఇలా అడగడంతో గోపీచంద్ కాస్త ఇబ్బంది పడ్డారని అందుకే ఈ ఇంటర్వ్యూ తనకు పెద్దగా నచ్చలేదని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -