Janasena MLA: జనసేన ఎమ్మెల్యే దొంగ ఓట్లతో గెలిచాడా.. ఏమైందంటే?

Janasena MLA: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గా జరుగుతూనే ఉంటాయి. నిత్యం అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది.అయితే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఊహించనీ విధంగా మూడు చోట్ల విజయం అందుకోవడంతో ఆంధ్రప్రదేశ్ లో పచ్చగాలి వీస్తోందని తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని తెలుగు తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అనురాధ గెలుపొందడంతో నలుగురు వైసిపి ఎమ్మెల్యేలపై వేటుపడింది.సొంత పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు అంటూ పార్టీ వారిని సస్పెండ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే వీరు ఇలా క్రాస్ ఓటు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏకంగా 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేశారనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.

 

ఇక ఈ వార్తలు నిజమేనంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బేరం మొదట తన వద్దకే వచ్చిందని అందుకు తాను ఒప్పుకోలేదంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన తాను ఒప్పుకోలేదంటూ వెల్లడించిన రాపాక తాజాగా తాను దొంగ ఓట్లతోనే గెలిచానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

 

తాను ఎమ్మెల్యే కావడానికి దొంగ ఓట్లే కారణమని తన సొంత గ్రామమైనటువంటి చింతలమోరిలో తనకు భారీగా దొంగ ఓట్లు పడ్డాయని రాపాక వెల్లడించారు. ఒక్కొక్కరు దాదాపు పది ఓట్లకు పైగా దొంగ ఓట్లు వేశారని ఇలా సొంత గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాలలో కూడా దొంగ ఓట్లు వేయటం వల్లే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -