Actress Sana: ఈ ప్రముఖ నటి కూతురుకు అలాంటి కష్టాలు ఎదురయ్యాయా?

Actress Sana: తెలుగు ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి సనం బేగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలలోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలలో ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది సనం బేగం. మొదట మోడల్ గా అడుగుపెట్టిన ఆమె నిన్నే పెళ్ళాడుతా సినిమాలో బెనర్జీ వైఫ్ క్యారెక్టర్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన చక్రవాకం సీరియల్ నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది సనం బేగం.

 

చక్రవాకం సీరియల్ ద్వారా పాపులర్ చేనే సంపాదించుకోవడంతో పాటు ఎన్నో అవకాశాలను కూడా అందుకుంది. అలా తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించింది.. సీరియల్స్ నటిస్తూనే వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. ఇకపోతే ఈమె ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈమె ఇటీవలె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా కెరియర్ లో జరిగిన ఎన్నో విషయాలను ఆమె వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

ఆమె ఇంటర్ చదివే సమయంలోనే పెళ్లి చేసుకున్నారట. ఆమె తండ్రికీ వ్యాపారంలో లాస్ రావడంతో వెంటనే ఆమెకు త్వరగా పెళ్లి చేసేసారట. ఆ తర్వాత అత్తింటి వాళ్లతో సహాయంతో ఆమె బి.ఎడ్ వరకు చదివింది. మొదట ఆమె స్కూల్ ప్రారంభించాలి అనుకున్నప్పటికీ ఆ తర్వాత అనుకోకుండా మోడలింగ్ వైపు అడుగులు వేసి ఇంట్లో అత్తమామల సపోర్ట్ తో యాడ్లలో నటిస్తూ వచ్చింది. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత ఇద్దరూ పిల్లలు పుట్టిన తర్వాత కూడా సినిమాలలో సీరియల్స్ లో నటిస్తూ వచ్చింది సన. కానీ తన పిల్లల్ని మాత్రం సినిమా ఫీల్డ్ లోకి తీసుకురాలేదు.

 

ఆమె కూతురికి సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ ఆమెకు ఇష్టం లేక సినిమాలోకి వద్దనుకొందట. రా కూతురు చదువు పూర్తయి పెళ్లి చేసి అత్తారింటికి పంపగా వాళ్ళు బాగా మోసం చేయడంతో ఆ సమయంలో తెలంగాణ పోలీసులు తనకు ఆ విషయంలో బాగా సహాయం చేసినట్లు ఆమె తెలిపింది. దుబాయ్ లో ఇల్లు ఉంది అని చెప్పి అక్కడ బాగా చిత్రహింసలు పెట్టి అక్కడే ఒకచోట అని చెప్పి తన కూతుర్ని మరొక స్థానంలో ఉంచారట. అయితే ఆకు ఆ విషయాలు అన్నీ కూడా తన కూతురు చెప్పలేదని కూతురు చెప్పకపోయినా విషయాలు తెలుసుకొని తనని తీసుకువచ్చి పోలీసుల సహాయంతో వారిని అరెస్టు చేయించినట్లు చెప్పుకొచ్చింది సనం బేగం. తన కూతురికి అలా జరిగినప్పుడు తన భర్త కొడుకు కూడా అండగా నిలబడినట్లు ఆమె తెలిపింది. తన కూతురు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ చేస్తోందని అంతేకాకుండా తన కూతురికి ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది అని తెలిపింది సనా బేగం.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -