Villain: ఈ స్టార్ విలన్ అలాంటి కష్టాలు భరించి చనిపోయారా?

Villain: తెలుగు సినిమా రంగంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సినిమా తెర మీద కనిపించే హీరో దగ్గరి నుండి హీరో చేతిలో తన్నులు తినే విలన్ల వరకు ప్రతి ఒక్కరికి ఎంతో గుర్తింపు ఉంటుంది. చాలా సినిమాల్లో హీరోలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో, విలన్లకు కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంటుంది. అలా హీరోలు స్టార్ హీరోలుగా అయితే, విలన్లు స్టార్ విలన్లుగా మారుతుంటారు.

టాలీవుడ్ కి విలనిజంలో కొత్తదనాన్ని పరిచయం చేసిన విలక్షణ విలన్ రాం రెడ్డి. ఈ తరం వారికి పెద్దగా పరిచయం లేని రాంరెడ్డి.. విలన్ గా కొన్ని తరాల పాటు టాలీవుడ్ ను ఊపేశాడు. అతడు విలన్ గా సినిమా చేస్తున్నాడు అంటే చాలు ఎంతో క్రేజ్ ఉండింది. అతడి విలన్ నటనలో ప్రేక్షకులు తెలియని ఓ కొత్తదనం కనిపించేది.. అందుకే అతడిని ప్రేక్షకులు బాగా ఆదరించే వారు.

అయితే తెలుగు తెర మీద స్టార్ విలన్ గా ఎదిగి ఎంతో మెప్పు పొందిన రాంరెడ్డి.. చనిపోయే ముందు అతడు అనుభవించిన కష్టాలను చూస్తే మాత్రం దారుణంగా అనిపిస్తుంటుంది. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించిన రాంరెడ్డి.. మూత్రపిండాల వ్యాధిని ఎదుర్కొన్నాడు. దీంతో అతడు విపరీతంగా చక్కచిక్కిపోయి కనీసం గుర్తుపట్టని పరిస్థితిలో ఉండిపోయాడు.

విలన్ గా ఎన్నో సినిమాలు నటించిన రాంరెడ్డి.. అనారోగ్యంతో బాధపడుతున్న సమయానికి పేదరికంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఆస్పత్రి ఖర్చులకు కూడా డబ్బులు లేని దీన స్థితిలో రాంరెడ్డి ఆస్పత్రిలో చేరారని.. తీవ్ర అనారోగ్యంతో అతడు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఒక ఉత్తమ విలన్ గా వెలుగు వెలిగిన రాంరెడ్డి.. చివరి దశలో మాత్రం నరకం అనుభవించాడట.

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: జగన్ మేనిఫెస్టోపై జనాభిప్రాయం ఇదే.. బాబోయ్ జగన్ అంటున్న ఏపీ ప్రజలు!

YSRCP Manifesto: శనివారం రోజు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైసీపీ మేనిఫెస్టో...
- Advertisement -
- Advertisement -