IAS: చెయ్యి లేకపోయినా ఈ యువతి ఐఏఎస్ కావడానికి అంత కష్టపడ్డారా?

IAS: దృఢమైన లక్ష్యాన్ని పెట్టుకొని ఎలాగైనా లక్ష్యాన్ని సాధించాలి అంటే లక్ష్యాన్ని సాధించడం ఆలస్యమైనా మన సంకల్పాన్ని మాత్రం నెరవేర్చుకుంటాము.అయితే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మధ్యలో ఎన్నో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి ఆ అడ్డంకులను చూసి మన ప్రయత్నం ఎప్పుడూ విరమించకుండా ముందుకు నడిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరగలమని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చెందిన అఖిల నిరూపించడం జరిగింది.

 

అఖిల ప్రమాదానికి గురై ఒక చేయిని కోల్పోయిన ఏమాత్రం నిరుత్సాహపడట్లేదు. తన అంగవైకల్యాన్ని చూసి కుమిలిపోలేదు ఎంతో ధైర్యంతో ముందడుగు వేసింది.చేయి లేకపోయినా యుపిఎస్సి సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించి అందరికీ చాలా స్ఫూర్తిదాయకంగా ఆదర్శంగా నిలిచింది. యూపీఎస్సీ 2022 పరీక్ష ఫలితాలలో అఖిల 760 ర్యాంకు సాధించి సంచలనాలను సృష్టించారు.

చిన్నప్పటినుంచి స్కూల్ కాలేజీలో టాపర్ గా ఉన్నటువంటి ఈమె మద్రాస్ ఐఐటిలో ఇంటిగ్రేటెడ్ ఎం ఏ పూర్తి చేశారు.స్కూల్ చదువుతున్న సమయంలోనే టీచర్ కావాలనుకున్నటువంటి ఈమె పెరిగి పెద్దవడంతో తన లక్ష్యం కూడా మార్చుకొని సివిల్స్ టార్గెట్ పెట్టుకున్నారు అయితే ఊహించని విధంగా ఓ బస్సు ప్రమాదంలో చేయని కోల్పోయిన అఖిల ఏమాత్రం నిరుత్సాహపడకుండా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు.

 

శారీరకంగా తనకు అంగవైకల్యం ఏర్పడినప్పటికీ మానసికంగా ఎంతో దృఢంగా ఉంటూ కుడిచేయిని కోల్పోయిన ఎడమ చేతితోనే రాయడం నేర్చుకున్న ఈమె సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు ఇలా పట్టుదలతో సివిల్స్ పరీక్షలు రాసి మంచి ర్యాంక్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా సివిల్స్ లో అర్హత సాధించడం వల్ల తనలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందంటూ అఖిల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -