IAS: తండ్రి ఫార్మసిస్ట్.. కూతురు ఐఏఎస్.. ఈమె సక్సెస్ స్టోరీ భలే ఉందంటూ?

IAS: జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకొని మంచి స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేసినప్పుడే ఫలితాలు లభిస్తాయి. ఇప్పటికే ఎంతోమంది నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ కొలువులలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎంతోమంది ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. నిలిచినటువంటి వారిలో ఈ ఐఏఎస్ దీక్షిత జోషి కూడా ఒకరిని చెప్పాలి.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానికి చెందిన దీక్షిత జోషి 2022 జరిగిన యుపిఎస్సి పరీక్ష ఫలితాలలో ఆమె 58వ ర్యాంకు సాధించి రికార్డు సృష్టించారు.దీక్షితా జోషి ఈ స్థాయిలో నిలవడం కోసం అనుభవించిన కష్టం అంతాఇంతా కాదు. దీక్షిత తల్లి ఇంటర్ కాలేజీలో హిందీ లెక్చరర్ గా పనిచేసే వారు ఇక ఈమె తండ్రి ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఐఐటీ మండీ నుంచి మాస్టర్స్ చేసిన దీక్షిత లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్య సాధన దిశగా అడుగులు వేశారు.

 

ఈ విధంగా మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఈమె ఐఏఎస్ కావాలన్న ఉద్దేశంతో ఏ విధమైనటువంటి కోచింగ్ లేకుండా సొంతంగా నోట్ ప్రిపేర్ చేసుకొని యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యారు. ఇలా కోచింగ్ లేకుండా సొంత టాలెంట్ తోనే ఈమె ఏకంగా యూపీఎస్సీ పరీక్ష ఫలితాలలో 58వ ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించారు. జీవితంలో ఓటమికి ఎప్పుడు భయపడకూడదని దృఢమైన సంకల్పంతో ముందుకు వెళితే విజయం మన సొంతమవుతుందంటూ ఈమె ఎందరికో స్ఫూర్తిని ఇచ్చే మాటలను తెలియజేశారు. ఏది ఏమైనా కోచింగ్ లేకుండా యూపీఎస్సీ ఎగ్జామ్స్ ర్యాంకు సాధించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఈ విజయం వెనుక దీక్షిత కఠినమైన కృషి ఉందో అర్థమవుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -