Success Story: ప్రేయసి కోసం కోట్ల జీతం వ‌దిలి క‌లెక్ట‌ర్ అయ్యాడు.. ఇతని సక్సెస్ స్టోరీకి షాకవ్వాల్సిందే!

Success Story: జీవితంలో పైకి ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. అందుకోసం చాలా కష్టపడి రాత్రి పగళ్ళు చదివి మరి వారి కలలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి కూడా ఈ విధంగానే సంవత్సరానికి కోట్లలో జీతం వచ్చే ఉద్యోగాన్ని సాధించాడు. దానితో అతను సంతోషంగా జీవించవచ్చు. కానీ అతను మాత్రం తన ప్రేయసికి ఇచ్చిన మాట కోసం అతను కోట్ల రూపాయలు వచ్చే జీతాన్ని, ఉద్యోగానికి వదిలి మాటను నిలబెట్టుకున్నాడు. ఇంతకీ అతను తన ప్రేయసికి ఏమని మాట ఇచ్చాడు? ఆమె ప్రియుడిని ఏమి కోరిక కోరింది అన్న వివరాల్లోకి వెళితే..

సౌత్ కొరియాలో ఒక హోటల్ లో ఇద్దరు ప్రేమికులు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. అది కూడా వారి భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే వారిద్దరూ కూడా భారతదేశం నుండి కొరియాకు ఉద్యోగం కోసమే వెళ్లారు. సాంసంగ్ కంపెనీలో ఆ వ్యక్తి ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్నాడు. అతను డిన్నర్ చేస్తున్న సమయంలో తన ప్రేయసిని నువ్వు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగాడు. దానికి ఆమె నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలన్నదే తన కోరిక అని తెలిపింది. అప్పుడు అతను నీ కోరిక ఇదేనా? అయితే నేటి నుండి నీ కోరిక తీర్చడమే నా గోల్ అని, కోట్ల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇండియా వచ్చాడు.

 

అప్పటి నుండి సివిల్స్ కి కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అయితే సివిల్స్ రాయడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఆ విషయం క‌నిష్క్ క‌టారియాకి బాగా తెలుసు. ఎందుకంటే అతని తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి. ఇండియాకి వచ్చిన తర్వాత సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అతను తొలిసారే ప్రిలిమ్స్ కి క్వాలిఫై అయ్యాడు. క‌టారియా ఆప్షనల్ సబ్జెక్టుగా మ్యాథమెటిక్స్ ను ఎంచుకుని, 2018 లో సివిల్ పరీక్షలు రాసి, అందులో ఫస్ట్ ర్యాంకును సంపాదించాడు. UPPSC లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన క‌నిష్క్ క‌టారియా అంటూ వార్త‌ల్లో నిలిచాడు. కొరియాలో డిన్నర్ చేస్తూ ప్రేయసీకి మాట ఇచ్చిన వ్యక్తి ఇతనే. 2019లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -