Success Story: ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే మాత్రం గూస్ బంప్స్ రావాల్సిందే!

Success Story: నిద్రలో కలలు కనటం కాదు, కలలని సాకారం చేసుకోవడం కోసం నిద్రపోకూడదు అని నిరూపించిన ఒక వెయిటర్ సక్సెస్ స్టోరీ ఇది. చాలామంది ప్రజలు తమ కలలను నెరవేర్చుకునే అవకాశం లేనందున వాటిని వదులుకోవాల్సి వస్తుంది కానీ ఈ మనిషి కోరుకున్నది సాధించడం కోసం ఏకంగా ఏడు సంవత్సరాలు కష్టపడ్డాడు ఆ వ్యక్తి ఎవరు, ఆ స్టోరీ ఏంటో చూద్దాం.

సివిల్ సర్వీస్ ఎగ్జాంలో 6 సార్లు ఓడిపోయి ఏడవ సారి విజయం సాధించిన స్ఫూర్తి దాత జై గణేష్. వెల్లూరు జిల్లాలోని వినవమంగళం అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన కే జై గణేష్ కు ఆర్థికంగా బాగా వెనుకబడినవాడు అతని తండ్రి ఫ్యాక్టరీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తను గ్రామంలోని పాఠశాలలో 8వ తరగతి వరకు చదివాడు.

 

పదో తరగతి పాస్ అయితేనే ఉద్యోగం వస్తుందని చెప్పడంతో పాలిటెక్నిక్ కళాశాలలో చేరాడు. అక్కడ పరీక్షలో 91 శాతం మార్పులతో ఉతేర్నత సాధించి తంతి పెరియార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో చదివాడు. తరువాత అతను వెయిటర్ గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు.

 

నెలకి 2500 జీతం కానీ ఆ సంపాదన అతని కుటుంబం ని నడపటం సులువు కాదని అర్థమైంది అందుకే ఐఏఎస్ కావాలని కలలు కన్నాడు. కానీ ఈ ప్రయాణం అంత సులువుగా జరగలేదు ఆరుసార్లు సివిల్ సర్వీస్ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా మళ్లీ సివిల్ సర్వీస్ ఎగ్జాం కి ప్రిపేర్ అయ్యాడు.

 

చిట్ట చివరికి 2008లో జై గణేష్ తన చిరకాల స్వప్నాన్ని సాధించాడు. 700 మందికి పైగా వున్న అభ్యర్థులలో 156వ ర్యాంకు సాధించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. తన విజయ ప్రస్థానాన్ని గురించి జై గణేష్ మాట్లాడుతూ నా కలను సహకారం చేసుకోవడానికి నాపై నమ్మకం కోల్పోకుండా నేను నిజంగా కష్టపడ్డాను..నా నిజమైన పని ఇప్పుడు ప్రారంభమవుతుంది. పేదరికం ని రూపుమాపటానికి కేరళ లాగ తమిళనాడు కూడా అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు జై గణేష్.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -