Upasana: ఆ పని చేసి ఉపాసన చరణ్ పరువు తీసేసిందా.. ఏం జరిగిందంటే?

Upasana: మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం తండ్రిగా ప్రమోట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈయన కొడుకుగా భర్తగా ఓ తండ్రిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న రామ్ చరణ్ తాజాగా ఓ సందర్భంలో తన భార్య ఉపాసనకు ఇచ్చిన ఒక గిఫ్ట్ గురించి ఓపెన్ అయ్యారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ అబ్బాయిలు అమ్మాయిలకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనే విషయంలో చాలా వీక్ అని తెలిపారు. ముఖ్యంగా తాను ఈ విషయంలో మరింత వీక్ అని తెలిపారు.వారికి ఎలాంటి బహుమతులు నచ్చుతాయో తెలుసుకోవడం కష్టమని తెలపడమే కాకుండా తనకు జరిగినటువంటి ఓ అనుభవం గురించి కూడా తెలిపారు. పెళ్లయిన కొత్తలో ఉపాసనకు మంచి గిఫ్ట్ ఇచ్చి తనని సర్ప్రైజ్ చేయాలని భావించాను.

 

ఈ క్రమంలోనే తనకు ఏది నచ్చుతుందోనని ఆలోచించి దాదాపు 5 గంటల పాటు షాపింగ్ చేసి ఓ ఖరీదైన గిఫ్ట్ తనకు ఇచ్చాను. ఇలా ఆ గిఫ్ట్ చూసి సర్ప్రైజ్ అవుతుందని చాలా ఆతృతగా ఎదురు చూశాను కానీ ఆ గిఫ్ట్ చూసిన 5 సెకండ్లకే ఉపాసన నా మొహం మీద కొట్టిందని రామ్ చరణ్ తెలిపారు.అందుకే అమ్మాయిలకు సర్ప్రైజ్ ఇవ్వకుండా వారిని తీసుకెళ్లి వారికి నచ్చినది కొనివ్వడం ఎంతో ఉత్తమమని చరణ్ తెలిపారు.

 

ఈ విధంగా రామ్ చరణ్ తన భార్య ఉపాసనకు గిఫ్ట్ ఇవ్వడం గురించి తనకు జరిగిన అనుభవాన్ని తెలియజేస్తూ అబ్బాయిలకు ఇలాంటి సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -