V V Vinayak: చిరు, బాలయ్య సినిమాల గురించి వీవీ వినాయక్ అల అన్నారా?

V V Vinayak: తెలుగు చిత్ర పరిశ్రమలో హిపోక్రసీ ఎక్కువై పోయింది. ఇక్కడ దర్శకుడంటే మరో దర్శకుడికి పడదు. నిర్మాత అంటే మరో నిర్మాతకు ఏడుపు. హీరో అంటే మరో హీరోకు పడదు. ప్రముఖ రచయిత్రి, ఆర్జీవీ ఆరాధించే అయాన్ రాండ్ చెప్పినట్లు స్వార్థాన్ని మించిన సిద్దాంతం లేదన్న మాట ప్రతీ వర్గానికి వర్తిస్తుంది. సినీ ఇండస్ట్రీ దానికి అతీతమైంది కాదు. ఇక్కడ కూడా స్వార్థం, అసూయతో ఇతరులపై ఎలా పడితే అలా కామెంట్లు చేస్తున్నారు.

 

లోలోపల అంతా అసూయ పెట్టుకొని పైకి చాలా అద్భుతంగా నటించేస్తూ ఉంటారు. ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తారు. కానీ వారి నిజ స్వరూపాలు సినిమా తేడా కొట్టినప్పుడు బయటకు వస్తాయి. తోటి వాళ్లకు ఫోన్లు చేసి విమర్శలు చేస్తారు.

 

అయితే తాజాగా సంక్రాంతి బరిలో దిగిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాలపై ఓ మాస్ డైరక్టర్ ఒకరు తీవ్రమైన కామెంట్స్ చేశాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి సినిమా విడుదలైన రోజు తమ మిత్రులకు ఫోన్లు చేసి అసలు ఇది కథేనా..? ఇది సినిమానేనా..? ఆయన దర్శకుడేనా..? వారితో ఎవరైనా ఇట్లాంటి సినిమాలు తీస్తారా..? ఇలాంటి మాటలు అన్నారట.

 

మర్నాడు వాల్తేరు వీరయ్య రీలీజ్ అయిన రోజు మెగస్టార్ అవకాశం ఇస్తే ఇలాంటి సినిమా తీస్తాడా ఎవరైనా..? ఇలా అలా.. అంటూ విమర్శలు గుప్పించారంట. అవి విన్న ఇతర మిత్రులు అప్పుడు సైలెంట్ గానే ఉన్నా ఆ తరువాత ఇతరులకు ఫోన్ చేసి ఆ దర్శకుడు ఎలా నోరు పారేసుకుంటున్నాడో అని బుగ్గలు నొక్కుకుంటున్నారు. టాలీవుడ్ లోనే కాదు ఏ రంగంలోనైనా ఎలా పడితే అలా నోరు పారేసుకుంటే ఎటూ అక్కరకు రాకుండా పోయినవారిని ఎంతో మందిని చూశాం. చూస్తూనే ఉన్నాం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -