Ali: అలీ కూతురి పెళ్లికి అన్ని తులాల బంగారం కొనుగోలు చేశారా?

Ali: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉండగా.. వారిలో ప్రేక్షకులను ఎప్పుడూ కొత్తగా నవ్వించే కమెడియన్ అలీ. బాల నటుడిగా సినిమా రంగంలోకి ప్రవేశించిన కమెడియన్ అలీ.. కమెడియన్ గా, హీరోగా, యాంకర్ గా, హోస్ట్ గా అందరినీ అలరిస్తున్నాడు. తెలుగులో దశాబ్దాలుగా ఎంతో మంది నటులు, డైరెక్టర్లతో కలిసి పని చేసిన అలీ.. అన్ని రకాలుగా బాగా సెటిల్ అయ్యాడు.

 

కమెడియన్ అలీ కూతురు ఫాతిమా పెళ్లీడుకు రాగా.. ఆమెకు త్వరలోనే పెళ్లి చేయనున్నాడు. ఇందులో భాగంగా పసుపు దంచే కార్యక్రమం, బ్రైడల్ షవర్ లాంటి కార్యక్రమాలు పూర్తి కాగా.. అలీ దంపతులు ఓ పక్క వెడ్డింగ్ కార్డులు పంచుతూనే షాపింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా అలీ తన కూతురి పెళ్లి కోసం ఎంత బంగారం కొన్నాడో తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. తన కూతురు ఫాతిమా కోసం అలీ ఏకంగా 40 తులాల బంగారం కొన్నాడని తెలుస్తోంది.

 

ఎంతో అంగరంగ వైభవంగా తన కూతురి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న అలీ.. సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు ఇస్తున్నాడు. దీంతో పెళ్లికి భారీగా వీఐపీలు వచ్చే అవకాశం ఉంది. కాగా అలీ భార్య జుబేదా షాపింగ్ కు సంబందించిన ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. పెళ్లి కోసం అంటూ తన కూతురి పేరు చెప్పి తాను బంగారం కొన్నట్లు అందులో వివరించింది.

 

ఏడు వారాల నగలు కాకుండా ఏమైనా అడుగు అని అలీ అనగా.. ఆయన భార్య ఖరీదైన ఆభరణాలను సెలెక్ట్ చేసింది. దీంతో అలీ మరో మాట మాట్లాడకుండా బిల్ కట్టడం జరిగింది. మొత్తానికి చాలారోజుల తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన వారంతా ఒక చోట కలిసే సందర్భం అలీ కూతురి పెళ్లి ద్వారా వచ్చింది. అధికారికంగానే అలీ తన కూతురికి 40 తులాల బంగారం పెడితే.. అనధికారికంగా ఎంత పెట్టాడో అంటూ ఇండస్ట్రీలోని వారు గుసగుసలాడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: సీఎం జగన్ కు ఆ ఎన్నికలంటే భయమా.. ఏం జరిగిందంటే?

CM Jagan: ఏపీలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఎన్నికలను నిర్వహించడానికి జగన్ సర్కారు వెనుకడుగు వేస్తోందని తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఎన్నికల గురించి...
- Advertisement -
- Advertisement -