Naga Chaitanya: నాగచైతన్యకు అఖిల్ మాత్రమే కాకుండా ఇంకో తమ్ముడు ఉన్నారని మీకు తెలుసా?

Naga Chaitanya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా నాగార్జున అనంతరం నాగచైతన్య అఖిల్ వంటి వారు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వీరి వ్యక్తిగత విషయానికి వస్తే నాగార్జున దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే వీరికి నాగచైతన్య పుట్టిన తర్వాత వీరిద్దరూ విడాకులతో విడిపోయారు.

ఈ విధంగా నాగార్జున లక్ష్మికి విడాకులు ఇచ్చి హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్ జన్మించారు.అఖిల్ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు మనకు నాగచైతన్యకు కేవలం అఖిల్ మాత్రమే తమ్ముడుగా ఉన్నారని తెలుసు కానీ నాగచైతన్యకు మరో తమ్ముడు కూడా ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు. మరి నాగచైతన్య రెండవ తమ్ముడు ఎవరు? ఏం చేస్తున్నారనే విషయానికి వస్తే..

నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి నాగార్జున నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చెన్నైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త శరత్ రాఘవన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించారు. అయితే ఈయన ఎక్కడ కనిపించకపోయినప్పటికీ తాను మాత్రం చెన్నైలో తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా నాగచైతన్య మరో తమ్ముడు కూడా వ్యాపార రంగంలో దూసుకుపోతూ ఒక వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు.

ఇకపోతే ఈయన ఎప్పుడూ కూడా బయట కనిపించకపోవడంతో ఈయన గురించి పెద్దగా తెలియదు అయితే ఈ మధ్యకాలంలో లక్ష్మి శరత్ రాఘవన్ దంపతులకు జన్మించిన ఈ కుమారుడు కూడా వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా నాగచైతన్య ఇద్దరు తమ్ముళ్లకు అన్నయ్య అయ్యారు. ఇక నాగచైతన్య సైతం సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని తనకు విడాకులు ఇచ్చారు.విడాకుల అనంతరం ఈయన ప్రస్తుతం తన దృష్టిని సినిమాలపై మాత్రమే పెట్టి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -