Naga Chaitanya: ఆ సినిమాను రిజెక్ట్ చేసి చైతన్య జీవితాన్ని నాశనం చేసిన నాగ్.. ఏం జరిగిందంటే?

Naga Chaitanya: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు కొన్ని అద్భుతమైన సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా వారు రిజెక్ట్ చేసిన సినిమాలు వేరే హీరో హీరోయిన్లు నటించి మంచి సక్సెస్ అందుకుంటే ఆ సినిమా వదిలేసి ఎందుకు తప్పు చేసామో అని ఇప్పటికి కూడా కొన్ని సినిమాల విషయంలో కొందరు సెలబ్రిటీలు పశ్చాత్తాప పడుతూ ఉంటారు.

ఇలా ఎంతో మంది హీరోలు సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నటుడు నాగార్జున సైతం నాగచైతన్యకు వచ్చినటువంటి ఒక మంచి సినిమా అవకాశాన్ని రిజెక్ట్ చేసి ఆయన కెరియర్ పై కోలుకోలేని దెబ్బ కొట్టారని తెలుస్తోంది. మరి నాగచైతన్యకు వచ్చిన ఏ సినిమా అవకాశాన్ని నాగార్జున రిజెక్ట్ చేశారు అనే విషయానికి వస్తే..

శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా పరిచయమవుతూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం కొత్త బంగారులోకం దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా 2008వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కథతో శ్రీకాంత్ అడ్డాల ముందుగా నటుడు నాగచైతన్య వద్దకు వెళ్లారట ఈ కథ విన్నటువంటి నాగార్జున ఈ సినిమా స్టోరీ పెద్దగా బాగాలేదని రిజెక్ట్ చేశారు. అనంతరం దర్శకుడు రామ్ వద్దకు వెళ్లగా ఆయన కూడా ఈ సినిమా కథ నచ్చక రిజెక్ట్ చేశారు.

ఇకవరుణ్ సందేశ్ అప్పటికే హ్యాపీ డేస్ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఆయనని కలిసి సినిమా కథ చెప్పారు. ఇక వరుణ్ సందేశ్ కూడా ఈ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శ్వేతా బసు ప్రసాద్ వరుణ్ సందేశ్ కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అయిందో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాగార్జున ఈ సినిమా విషయంలో ఎంతో బాధపడ్డారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -