Patriotic Songs: ఈ తెలుగు సినిమాలు దేశభక్తి పాటల వల్ల హిట్టయ్యాయని తెలుసా?

Patriotic Songs: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు దేశభక్తి మీద వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.. మరి కొన్ని సినిమాలలో దేశభక్తి పాటలు కూడా ఉన్నాయి. అయితే చాలా వరకు దేశభక్తి పాటల వల్ల కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. మరి అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేశభక్తి పాటల వల్ల హిట్ అయిన సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా ఒక దేశభక్తి పాట ఉంది అయినా కూడా అది పెద్ద ఎఫెక్టివ్ గా లేదు కానీ పీరియాడిక్ సబ్జెక్టు కాబట్టి పెట్టక తప్పలేదు.

 

ఇక మహేష్ బాబు నటించిన బాబీ సినిమా చాల పెద్ద ప్లాప్. కానీ అందులో వచ్చే వందే మాత్రం పాట మంచి హిట్ గా నిలిచింది. ఈ ఒక్క పాట కోసం ఆ సినిమాను పక్క గుర్తు పెట్టుకోవచ్చు. బాలకృష్ణ, కృష్ణ కృష్ణం రాజు కలిసి నటించిన సుల్తాన్ సినిమా పెద్ద ప్లాప్ కానీ ఆ సినిమాలో కూడా వందేమాతరం సినిమా అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు విడుదల అయిన బడి పంతులు చిత్రంలో భారత మాతకు జేజేలు పాట ఎంత చక్కగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంలో తెలుగు వీర లేవరా అనే పాట తో ఈ సినిమా పెద్ద విజయం సాధించింది.

 

వెలుగు నీడలు అనే సినిమాలో కూడా పాడవోయి భారతీయడా పాట ఇప్పటికి ప్రతి పల్లెల్లో వినిపిస్తూనే ఉంటుంది. బొబ్బిలి పులి సినిమాలో జనని జన్మభూమిచ్చ, ఖడ్గం సినిమాలో మేమే భారతీయులం పాటలు వింటే దేశభక్తి పొంగిపోతుంది. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమాలో సైనిక పాట పెద్ద హిట్. బద్రి చిత్రంలో ఐ యాం ఇండియన్స్ పాట, పవన్ కళ్యాణ్ మరొక చిత్రం ఖుషి చిత్రంలో ఏ మేరా జహా, శంకర్ దాదా జిందాబాద్ లో ఓ బాపూ నువ్వే రావాలి పాట కూడా పెద్ద హిట్ ఇలా చాలా సినిమాలలో దేశభక్తి పాటలు ఉండడంతో ఆ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

Related Articles

ట్రేండింగ్

Bhuvaneshwari-Brahmani: భువనేశ్వరి, బ్రాహ్మణి విషయంలో సీఐడీ స్కెచ్ ఇదేనా.. వాళ్లకు ఇబ్బందులు తప్పవా?

Bhuvaneshwari-Brahmani: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ప్రజలు పీఠాన్ని ఎక్కిస్తే, ఆ పదవిని కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవటానికి వాడుకుంటున్నారు నేటి మంత్రులు. ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే చేస్తున్నాడు. తనను అన్యాయంగా కేసులో...
- Advertisement -
- Advertisement -