Shaakuntalam: శాకుంతలం ట్రైలర్ లో ఇది గమనించారా.. అలా జరిగిందంటూ?

Shaakuntalam: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. శకుంతల దుష్యంతులం అందమైన ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని గుణ టీమ్స్ వర్క్ బ్యానర్ నీలిమ గుణ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

ఇక ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఇంటర్వ్యూలలో పాల్గొనడమే కాకుండా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.1.34 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ ట్రైలర్ వీడియోలో చూపించిన సన్నివేశాల ద్వారానే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది.

 

ఈ ట్రైలర్ దుష్యంతుడు శకుంతల పరిచయం ప్రేమ సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. అదే సమయంలోనే విశ్వామిత్రుడు శకుంతలపై కన్నెర్ర చేయడంతో కథ మొత్తం కీలక మలుపు తిరుగుతుంది. ఇక ప్రేమ జంట మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడిపోవడం జరుగుతుంది. అయితే అదే సమయంలో సమంత ప్రెగ్నెంట్ అవ్వడంతో ఎన్నో కష్టాలు పడుతుంది. ఈ సందర్భంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ఇంతవరకు తెచ్చుకున్నావు ఫలితం అనుభవించాల్సిందే అని దుష్యంతుడు చెప్పే డైలాగ్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇలా ఈ ప్రేమ జంట ఎందుకు విడిపోయారు అనే విషయం గురించి పెద్ద ఎత్తున ఆసక్తి ఏర్పడింది మరి ఎందుకు విడిపోయారు అనే విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే అయితే ఈ సినిమాలోని సమంత పాత్రకు అనుగుణంగానే నిజ జీవితంలో కూడా సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కొన్ని మనస్పర్ధలు కారణంగా తనకు దూరమయ్యారు. అయితే ఇప్పటివరకు సమంత నాగచైతన్య విడాకులకు కూడా కారణాలు ఏంటి అనేది తెలియడం లేదు.ఈ ట్రైలర్ సమంత నిజ జీవితానికి దగ్గరగా ఉంది అంటూ కొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -