Srivas: అంత మంచి సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదులుకున్నారా?

Srivas: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు మహర్షి సినిమాలో ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో మనకు తెలిసిందే.కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ హెడ్ కాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా కూడా అదే స్థాయిలో ఆదరణ అందుకుంది. అయితే ఈ సినిమాలు విడుదలై చాలా కాలం తర్వాత ఈ సినిమాల గురించి దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నానని అయితే ఈ కథను నిర్మాత దిల్ రాజు గారికి వినిపించగా ఆయన చాలా బాగుంది చేద్దామని చెప్పారు. అయితే ఈ సినిమా చేద్దాం అనుకునే లోపు శ్రీమంతుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇలా ఈ సినిమాతో తాను అనుకున్న కథలో ఒక లేయర్ వెళ్లిపోయిందని తెలిపారు.అనంతరం మహర్షి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది తన కథలో మరొక పాయింట్ వెళ్లిపోయిందని శ్రీవాస్ తెలిపారు. అలాగే శతమానం భవతి సినిమా కూడా తన కథకు దగ్గర సంబంధం ఉందని ఈయన తెలియచేశారు.

 

ఇలా తాను అనుకున్న సినిమా కథ నుంచి మూడు సినిమాలు వచ్చినప్పటికీ తన సినిమా కథలో మెయిన్ పాయింట్ అలాగే ఉందని ఎప్పటికైనా అదే పాయింట్ పై తన సినిమా చేస్తానని డైరెక్టర్ శ్రీవాస్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక తాజాగా ఈయన దర్శకత్వంలో తిరిగి ఎక్కిన రామబాణం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాలన్నింటినీ వెల్లడించారు.

 

ఒకానొక సమయంలో డైరెక్టర్ శ్రీవాస్,హీరో గోపీచంద్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వచ్చాయి ఈ విషయం గురించి కూడా ఈయన మాట్లాడుతూ…డైరెక్టర్ ఒకటి హీరో ఒకటి అనుకోవడం కామన్ వేరే హీరో అయితే మరోలా ఉండేదని అక్కడ హీరో గోపీచంద్ కావడంతో తనతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఇద్దరి మధ్య వాదనలు వచ్చాయని ఈయన తెలియజేశారు. ఈ సినిమా అన్నదమ్ముల బంధాలు చూపిస్తూ, ఇటు ఎంటర్ టైన్ మెంట్, అటు యాక్షన్ కలిసిన సినిమా అన్నారు. లక్ష్యం లౌక్యం తర్వాత గోపీచంద్ తో తాను చేస్తున్న సినిమా ఇదని ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీవాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chiranjeevi: చిరంజీవిపై విషం చిమ్మడం పాత్రికేయమా.. ఇది వ్యభిచారం కాదు వెబ్ చారమ్ అంటూ?

Chiranjeevi: ప్రస్తుత కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి చానల్స్ పెట్టుకోవడం కూడా గమనార్హం. అయితే ఒక...
- Advertisement -
- Advertisement -