SIIMA: చరణ్ వర్సెస్ ఎన్టీఆర్.. ఈ ఇద్దరు టాలెంటెడ్ హీరోలలో సైమా ఉత్తమ హీరో ఎవరో?

SIIMA: టాలీవుడ్ హీరోలు,పాన్ ఇండియా స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ ఇద్దరు హీరోలు గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముందు నుంచే వీరిద్దరి మధ్య స్నేహబంధం ఉండగా ఈ సినిమాతో అధికాస్త మరింత బలపడింది. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాల కోసం ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఎంతో ఆత్రుతను ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో చరణ్, తారక్ లో టాలెంటెడ్ హీరో ఎవరు? అలాగే సైమా ఉత్తమ హీరో ఎవరో? అన్నా ప్రశ్నలపై అనేక రకాల సందేహాలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. ఈసారి బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ విభాగంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ నామినేషన్లు పడ్డాయి. ఈ ఇద్దరిలో ఎవరినీ తక్కువ చేయడానికి లేదనేంత గొప్పగా రామరాజు, భీమ్ లు పోటీపడి నటించారు.

 

కాబట్టి ఆర్ఆర్ఆర్ కు జాయింట్ గా స్టేజి మీద ఒకేసారి ఇవ్వవచ్చు. లేదంటే మిగిలిన నలుగురు కాంపిటీటర్ లను చూడాలి. మిగిలిన ఆ నలుగురు కాంపిటీటర్లు ఎవరు అన్న విషయానికి వస్తే.. అడవి శేష్, దుల్కర్ సల్మాన్, నిఖిల్, సిద్దు జొన్నలగడ్డ ఈ టైటిల్ కోసం రేస్ లో ఉన్నారు. దుబాయ్ లో సెప్టెంబర్ 15, 16 సైమా ఈవెంట్ జరుగుతుంది. ఎలా లెక్కగట్టినా ఎక్కువ అవకాశాలు ఆర్ఆర్ఆర్ హీరోలకే ఉన్నాయి. కానీ ఓట్ల శాతంతో పాటు ప్యానెల్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి. సినిమా విడుదల సమయంలోనే ఇద్దరు హీరోల అభిమానులు మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని సోషల్ మీడియాలో అర్థం లేని యుద్దాలు, ట్రోలింగ్ లు చేసుకున్నారు. అలాంటిది సైమాలో అవార్డు ఒకరికే ఇస్తే మళ్ళీ వేడి రాజుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -