Rajamouli Prashant Neel: రాజమౌళి, ప్రశాంత్ నీల్ లకు ఇష్టమైన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

Rajamouli Prashant Neel: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా అపజయం అనే మాట రాలేదు. అయితే సీరియల్స్ కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి రాజమౌళి ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు.

ఇలా ఈయన సినీ ప్రస్థానం మొదలైంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మొట్టమొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇకపోతే ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో ఇప్పటివరకు ఐదు సినిమాలు రాగా ఈ ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి.ఇలా హీరో డైరెక్టర్ అనే అనుబంధం కాకుండా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళికి ఇష్టమైనటువంటి హీరో ఎన్టీఆర్ అని కూడా చెప్పాలి.

 

ఇలా ఎన్టీఆర్ గురించి రాజమౌళి పలు సందర్భాలలో మాట్లాడుతూ తను తన ఫేవరెట్ హీరో అంటూ తెలియజేశారు. ఇక ఎన్టీఆర్ కూడా రాజమౌళి తోనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులతో కూడా ఒక హీరో మాదిరి కాకుండా సొంత కుటుంబ వ్యక్తుల కలిసిపోతూ ఉంటారు.అదేవిధంగా కే జి ఎఫ్ సినిమాతో సరికొత్త రికార్డులను సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీగా మారు మోగిపోయింది.

 

ఇలా కే జి ఎఫ్ సినిమాతో సెన్సేషనల్ సృష్టించినటువంటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రశాంత్ ఫేవరెట్ హీరో కూడా ఎన్టీఆర్ కావడం విశేషం.ఇలా పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ఇద్దరు డైరెక్టర్లకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాలలో తెలియచేయడంతో ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -